వైసిపి పార్టీపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన శ్రీ రెడ్డి

-

వైసీపీ పార్టీ అధికారం చేపట్టక ముందు.. అధికారం చేపట్టిన తరువాత పార్టీ వాయిస్ ని బలంగా వినిపిస్తూ అధికార పార్టీకి వీర విధేయురాలిగా మారింది శ్రీ రెడ్డి. పార్టీలో ఎలాంటి పదవి లేకపోయినా కూడా యాక్టివ్ మెంబర్ గా ఉంటూ ఎప్పుడెప్పుడు పార్టీలో జాయిన్ అయ్యి పార్టీలో క్రియాశీలక సభ్యురాలు గా మారడానికి ప్రయత్నిస్తూ ఉంది శ్రీ రెడ్డి. అయితే పార్టీ నుంచి పిలుపు రాకపోగా.. సాయం కోరిన కూడా పట్టించుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది శ్రీ రెడ్డి. తన సొంత ఊరిలో చేపట్టిన దైవ కార్యానికి ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తోంది శ్రీరెడ్డి.

శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి నిర్మాణం కోసం శ్రీ రెడ్డి, ఆమె తండ్రి ఎన్నో ఏళ్లుగా శ్రమిస్తున్నారు. టీడీపీ హయాంలో కొన్ని ఫండ్స్ రిలీజ్ కాగా.. వైసిపి అధికారం చేపట్టడంతో మిగిలిన ఫండ్స్ రిలీజ్ అవుతాయని, గుడి నిర్మాణం పూర్తి అవుతుందని కలలు కన్నది శ్రీరెడ్డి. అయితే తన అనుకున్న పార్టీ నుంచి పనులు కావడం లేదు అంటూ వాపోయింది శ్రీరెడ్డి. తాజాగా శ్రీ రెడ్డి ఫేస్బుక్ లో లైవ్ లో మాట్లాడుతూ.. “ఏ పార్టీ అయినా సరే.. పార్టీలతో సంబంధం లేకుండా.. కార్యకర్తలని దూరం చేసుకోకూడదు. ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి. ఎలా ఉన్నా మనం అధికారంలోకి వచ్చేస్థామని అనుకుంటే మూర్ఖత్వం అవుతుంది.

రేపు 20 సీట్లు తగ్గినా, 30 సీట్లు తగిన జనంలో అసంతృప్తి పెరుగుతుందనే వాస్తవాన్ని అధికార పార్టీ గ్రహించాలి. అధికారం అశాశ్వతం అనే నిజాన్ని గ్రహించాలి. మీ పథకాలు ఎంత బలంగా ఉన్నా.. అసంతృప్తి పెరగకుండా చూసుకోవాలి. నాకేమైనా వీళ్ళు రూపాయి పెడతారా? మా సొంత ఊరిలో గుడి కడుతున్నాం అంటే ప్రభుత్వం నుంచి రూపాయి సాయం అందలేదు అంటూ శ్రీ రెడ్డి వాపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news