మామూలుగా ఆపరేషన్ అంటేనే భయపడుతుంటారు. ఆపరేషన్ సక్సెస్ కావాలంటూ ముక్కోటి దేవతలకు ప్రార్థనలు చేస్తుంటారు. అయితే.. మెదడుకు ఆపరేషన్ అంటే మరీ భయం వెంటాడుతుంటుంది. అయితే ఛత్తీస్ గఢ్‌లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పుర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఈ ఆసక్తికర ఘటన జరిగింది. వైద్యులు మెదడులోని నరాలకు శస్త్రచికిత్స చేస్తుండగా రోగి గజల్స్ పాడుతూ ఎంజాయ్ చేస్తున్నాడు.
డాక్టర్ రాహుల్ అహ్లువాలియా ఈ ఆపరేషన్ చేశారు. ఆ సమయంలో గజల్స్ హమ్ చేస్తూ ఎంతో హుషారుగా వైద్యులకు రోగి సహకరించాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అయితే ఎంతో మందికి మెదడు ఆపరేషన్ చేశామని.. కానీ ఇలా ఆపరేషన్ చేస్తుండగా ఎంజాయ్ చేసేవారిని చూడడం మొదటి సారి అంటూ వైద్యులు చెబుతున్నారు.