రజనీకాంత్ సరసన మరోసారి ఐశ్వర్యారాయ్..తలైవర్ 169లో సర్‌ప్రైజెస్!

-

తమిళ్ తలైవా, సూపర్ స్టార్ రజనీకాంత్- ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన ‘రోబో’ పిక్చర్ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో రజనీ సరసన హీరోయిన్ గా మాజీ విశ్వ సుందరి ఐశ్వర్యారాయ్ నటించింది. కాగా, ఈమె మరోసారి రజనీకాంత్ సరసన కథానాయికగా నటించబోతున్నట్లు వార్తలొస్తున్నాయి.

‘బీస్ట్’ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రాబోయే తలైవర్ 169 ఫిల్మ్ లో కథానాయికగా నటించేందుకు ఐశ్వర్యా రాయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో రజనీకాంత్ మరో అవతారంలో కనిపించబోతున్నారట. దాంతో పాటు ఈ సినిమాకు స్టోరి కూడా రజనీకాంత్ ఇస్తున్నారని కోలీవుడ్ ఫిల్మ్ నగర్ సర్కిల్స్ టాక్.

సన్ పిక్చర్స్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తుండగా, వచ్చే నెల నుంచి ఈ పిక్చర్ షూటింగ్ ప్రారంభం కానుందని టాక్. అనిరుధ్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇక ఇందులో కీలక పాత్రలు పోషించడం కోసం ఇప్పటికే బ్యూటిఫుల్ హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ తో పాటు సీనియర్ హీరోయిన్ రమ్య కృష్ణన్ సంప్రదించినట్లు వినికిడి.

Read more RELATED
Recommended to you

Latest news