వీడియో: రాంగ్ రూట్‌లో ప్రయాణం.. స్కూటీని ఢీకొట్టిన బైక్..!!

-

బీహార్ రాజధాని పాట్నాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వెళ్తున్న ఓ బైక్.. రాంగ్‌ రూట్‌లో వస్తున్న స్కూటీని ఢీకొంది. దీంతో స్కూటీ, బైక్ ధ్వంసమైంది. ఈ మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

రోడ్డు ప్రమాదం
రోడ్డు ప్రమాదం

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాట్నాలోని గంగా పాథ్‌వేలో రోడ్డు ప్రమాదం జరిగిందన్నారు. వేగంగా వెళ్తున్న బైక్.. రాంగ్ రూట్‌లో వస్తున్న ఓ స్కూటర్‌ను ఢీ కొంది. దీంతో వాహనదారులకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. వాహనాలకు స్వాధీనం చేసుకున్నామని, విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news