ఎడిట్ నోట్ : ఎంఐఎం లాయ‌రుకు వంద‌నం..రఘునంద నంద‌నా !

-

న్యాయంగా చేప‌ట్టాల్సిన ప‌నులు కొన్ని చేయాల్సిందే ! న్యాయ దేవ‌త‌ను న‌మ్ముకుని ప్ర‌యాణించాల్సిందే ! న్యాయం ఉనికికి  విఘాతం తీసుకువ‌చ్చే ప‌నులు ఏవీ చేయ‌కూడ‌దు.  కానీ ఆ బాలిక విష‌య‌మై అన‌గా 16 ఏళ్ల మైన‌ర్ బాలిక విష‌య‌మై పోలీసులు న్యాయాన్ని న‌మ్ముకోవ‌డం లేదు. కేవలం రాజ‌కీయ ఒత్తిళ్ల‌కు లొంగిపోతున్నారు అన్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.
కానీ ఓ బ‌క్క చిక్కిన ప్రాణి మాత్రం త‌న వంతుగా వ్య‌వ‌స్థ‌కు అండ‌గా ఉండేందుకు ముందుకు వ‌చ్చారు. వ్య‌వ‌స్థ‌లో లోపాలు దిద్దేందుకు కూడా కొన్ని పోలీసు చర్య‌లు అడ్డంగా ఉన్నా కూడా పోరాడుతున్నారు. ఆ ఒక్క ప్రాణం పేరు.. ర‌ఘ‌నంద‌న్  రావు ..

పోలీసులు ఆయ‌న ద‌గ్గ‌రకు ఆధారాలు ఎలా వ‌చ్చాయి అని త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారే కానీ ఆధారాల్లో ఉన్న నిజానిజాలు గురించి మాట్లాడేందుకు ఆస‌క్తి మాత్రం చూప‌డం లేదు. వీడియో ఫుటేజీల‌ను గ‌మనిస్తే అన్ని  నిజాలూ తేలిపోతాయి. అయినా కూడా నిందితుల‌ను పోలీసులు కొన్ని  కార‌ణాల రీత్యా  దాచిపెడుతున్నార‌న్న ఆరోప‌ణ‌లు నిన్న‌మొన్న‌టి వ‌రకూ ఉన్నాయి.
అయితే.. ర‌ఘునంద‌న్ మాత్రం త‌దేక దీక్ష‌తో పోరాటం చేస్తున్నారు. పోలీసుల వెర్ష‌న్ ఎలా ఉన్నాకూడా త‌న వెర్ష‌న్ మాత్రం సూటిగానే ఉంది అని స్ప‌ష్టం చేస్తున్నారు. ఓ విధంగా ఆయ‌న సాహ‌సం కార‌ణంగా వివాదాస్ప‌ద ఆర్జీవీ కూడా ఫిదా అయిపోయారు. ఆయ‌న కూడా దుబ్బాక ఎమ్మెల్యే ర‌ఘ నంద‌న్ కు మ‌ద్ద‌తివ్వ‌డం విశేషం.

ఎన్ని క‌ష్టాలు వ‌చ్చినా, ఎన్ని క‌న్నీళ్లు వ‌చ్చినా నిజాల‌ను న‌మ్ముకుని ప్ర‌యాణించ‌డం మంచి ప‌ని! ఆ మంచి ప‌ని ఎవ్వ‌రు చేసినా అభినందించాలి. ఒక‌ప్పుడు జ‌ర్న‌లిజం చేసిన ర‌ఘునంద‌న్ త‌రువాత కాలంలో పొలిటీషియ‌న్ గా ఎదిగారు. కొంత కాలం ఆయ‌న పూర్వాశ్ర‌మాన ఎంఐఎం పార్టీకి అంటే ఓవైసీకి వ‌కీలుగా ప‌నిచేశారు. అయినా స‌రే ! జూబ్లీహిల్స్ గ్యాంగ్  రేప్ ఇష్యూకు సంబంధించి ఆయ‌న పోరాడుతున్నారు. ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకును, సంబంధిత ఆధారాల‌ను బ‌య‌ట‌పెట్టేందుకు వెనుకాడేది లేనే లేద‌ని అంటున్నారు. ఓ విధంగా ఆయ‌న సాహ‌సం బాగుంద‌ని అంతా అంటున్నారు. ఓ విధంగా ఆయ‌న ధైర్యం బాగుంద‌ని అంటా కొనియాడుతున్నారు.

వాస్త‌వానికి ఈ కేసులో టీఆర్ఎస్,ఎంఐఎం పెద్ద‌ల పిల్లలు ఇందులో నిందితులుగా ఉన్నారు. ఇప్ప‌టిదాకా ఆరుగురు నిందితులు అని  తేలారు. ఓ ఎమ్మెల్యే కొడుకు పేరు తేల్చేందుకు ఆఖ‌రిదాకా పోలీసులు త‌ర్జ‌న‌భ‌జ‌ర్జ‌న ప‌డ్డారు. ఆఖరికి ఆయ‌న పేరు కూడా చేర్చేందుకు సుముఖ‌త వ్య‌క్తం చేశారు. ఈ పోరులో గెలిచింది ర‌ఘునంద‌న్ రావు. అందుకే సోష‌ల్ మీడియాలో కూడా ఆయ‌న‌కు భ‌లే మ‌ద్ద‌తు వ‌స్తోంది. వివాదాస్ప‌ద ద‌ర్శ‌కులు ఆర్జీవీ కూడా ఆయ‌నను మెచ్చుకుంటున్నారు. ఈకేసులో ర‌ఘ‌నంద‌న్ రావు చెప్పిన‌వ‌న్నీ స‌బబుగానే ఉన్నాయి అని స్పందించారు ఆయ‌న.

Read more RELATED
Recommended to you

Latest news