వైరల్ ట్విట్: పూజా హెగ్డేతో రూడ్‌గా బిహేవ్ చేసిన ఇండిగో స్టాఫ్ సిబ్బంది

-

తెలుగు స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్‌లో ప్రస్తుతం స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా.. ఇతర సినీ ఇండస్ట్రీలోనూ తన సత్తా చాటుతోంది. అయితే తాజాగా పూజా హెగ్డే చేసిన ఒక ట్విట్ వైరల్ అయింది. ఇండిగో-6ఈ స్టాఫ్ సిబ్బంది తనతో అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పుకొచ్చింది.

పూజా హెగ్డే
పూజా హెగ్డే

ముంబై నుంచి ఇండిగో-6ఈ విమానంలో బయలు దేరిన పూజా హెగ్డేతో విపుల్ నకాషే అనే స్టాఫ్ సిబ్బంది అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘నేను ముంబైలో ఇండిగో-6ఈ విమానం ఎక్కాను. విమాన సిబ్బంది విపుల్ నకాషే ఎలాంటి కారణం లేకుండా నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. అహంకారంతో బెదిరింపులకు పాల్పడ్డాడు. మాపై గట్టి గట్టిగా అరిచాడు. నిజంగా అతడి మాటలు విని నాకు ఎంతో భయం వేసింది. సాధారణంగా ఇలాంటి విషయాలను నేను ఎక్కువగా పట్టించుకోను. కానీ ఈ వ్యక్తి ప్రవర్తన చూసి భయమేసింది. అందుకే ట్విట్ చేస్తున్నాను.’ అని ఆమె పేర్కొంది.

కాగా, ఈ ట్విట్‌కు చాలా మంది రీట్విట్‌లు చేస్తున్నారు. పూజా హెగ్డే అభిమానులు మాత్రం ఆ వ్యక్తిపై నిప్పుల వర్షం కురిపిస్తున్నారు. మరికొందరు.. తొందర ఎందుకు..? ఆ వ్యక్తి ఆరోపణలు విన్నాక.. నిజా నిజాలు తెలుస్తాయని చెబుతున్నారు. అప్పుడు అతడిపై యాక్షన్ తీసుకోవచ్చని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news