Monkeypox: బ్రెజిల్ లో తొలి కేసు.. 29 దేశాల్లో వెయ్యికిపైగా కేసులు

-

ప్రపంచంలో మంకీపాక్స్ కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే కరోనాతో అల్లకొల్లోలం అవుతున్న ప్రపంచాన్ని మంకీపాక్స్ వైరస్ కలవరపెడుతోంది. ఇప్పటికే ప్రపంచంలోని 29 దేశాల్లో 1019 కేసులు నమోదు అయ్యాయి. దీంతో మెల్లిమెల్లిగా ప్రపంచంలోని ఇతర దేశాలకు కూడా వ్యాధి విస్తరిస్తోంది. తాజాగా బ్రెజిల్ లో తొలి మంకీపాక్స్ కేసు నమోదు అయింది. సావోపాలో నగరంలో 41 ఏళ్ల వ్యక్తిలో వైరస్ ను కనుక్కున్నారు. దీంతో పాటు మరో అనుమానిత కేసును గుర్తించారు. 26 ఏళ్ల మహిళలో ఈ వ్యాధి లక్షణాలు ఉండటంతో వైద్యులు పర్యవేక్షిస్తున్నారు.

monkeypox-virus
monkeypox-virus

మే నెల మొదటివారంలో బ్రిటన్ లో తొలి కేసు నమోదు కాగా.. వరసగా యూరప్ లోని ఇతర దేశాల్లో కూడా వ్యాధి బయటపడిండి. ప్రస్తుతం బ్రిటన్ లో 302 కేసులు నమోదు కాగా.. స్పెయిన్ లో 198, పోర్చుగల్ లో 153, కెనడాలో 80 కేసులు నమోదు అయ్యాయి. పెరుగుతున్న మంకీపాక్స్ కేసులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవల ఇండియాలో యూపీలో ఒకరికి మంకీపాక్స్ తరహా లక్షణాలు కనిపించాయి. అయితే పూణే వైరాలజీ ల్యాబ్ లో టెస్ట్ చేయగా.. మంకీపాక్స్ కాదని నిర్థారణ అయింది.

 

Read more RELATED
Recommended to you

Latest news