తెలంగాణ విద్యార్థులకు షాక్‌.. 3 రెట్లు పెరిగిన బస్‌పాస్‌ ధరలు..

-

తెలంగాణలోని విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) షాక్‌ ఇచ్చింది. తెలంగాణలో పాఠ‌శాల‌ల పునఃప్రారంభం కానున్న స‌మ‌యంలో రాష్ట్ర విద్యార్థులకు టీఎస్‌ఆర్టీసీ భారీ షాక్‌ ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల రూట్ బ‌స్ పాసుల ధ‌ర‌ల‌ను ఏకంగా మూడింత‌ల మేర పెంచింది. ఈ మేర‌కు శుక్ర‌వారం సాయంత్రం టీఎస్సార్టీసీ నుంచి ఓ కీల‌క ప్ర‌క‌ట‌న విడుద‌లైంది. విద్యార్థుల రూట్ బ‌స్ పాసుల్లో భాగంగా 4 కిలో మీట‌ర్ల దూరానికి ఇప్ప‌టిదాకా రూ.165 చెల్లిస్తుంటే.. దానిని ఏకంగా రూ.450కి పెంచింది.

RTC to run 200 spl buses for Pranahita Pushkaralu- The New Indian Express

అదే స‌మ‌యంలో 8 కిలో మీట‌ర్ల దూరానికి ఇప్ప‌టిదాకా రూ.200గా ఉన్న ధ‌ర‌ను రూ.600ల‌కు పెంచింది. అదే మాదిరిగా 12 కిలో మీట‌ర్ల దూరానికి బ‌స్ పాస్ ధ‌ర‌ను రూ.245 నుంచి రూ.900ల‌కు పెంచింది. 18 కిలో మీట‌ర్ల దూరం బ‌స్ పాస్ ధ‌ర‌ను రూ.280 నుంచి రూ.1,150కి, 22 కిలో మీట‌ర్ల బ‌స్ పాస్ ధ‌ర‌ను రూ.330 నుంచి రూ.1,350కి పెంచింది. ఈ పెంపుతో విద్యార్థుల‌పై భారీ భారం ప‌డ‌నుంది.

Read more RELATED
Recommended to you

Latest news