దూద్ బావిలో నీళ్ళు తాగితే ఏమౌతుందో తెలుసా?

-

సాదారణంగా నీళ్ళు నీలం రంగులో లేదా ఎరుపు, లేదా బ్లూ కలర్ లో ఉంటాయి.. కానీ ఎప్పుడైనా నీళ్ళు తెల్లగా పాలు మాదిరిగా ఉండటం మనం ఎక్కడా చూసి ఎరుగము..కానీ అలాంటి నీళ్ల బావి ఒకటి ఉంది.. ఆ బావి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

బండరాళ్ల మధ్యలో వెలసిన బావి కావడంతో ఆ బావిలోని జలాన్ని ఔషదజలం గా భావిస్తున్నారు. అందుకే ఆ బావిని దూద్ బావి అని పిలుస్తున్నారు. ఇంతకీ ప్రత్యేకతలు కలిగిన ఆ బావి ఎక్కడుందంటే కరీంనగర్ జిల్లాలో ఉంది. జిల్లా కేంద్రానికి 30 కిలోమీటర్లు దూరంలో శంకరపట్నం మండలంలోని మొలంగూర్ లో పురాతన బావి ఉంది . దాన్ని దూద్ బౌలిగా పిలుస్తారు.ఈ బావిని సర్వరొగ నివారణ అక్కడి జనం పిలుస్తారు.

ఆ బావి నీళ్లు తాగితే రోగాలేవీ దరి చేరవనేది స్థానికుల నమ్మకం. అది ఇప్పటి మాట కాదు ప్రపంచాన్ని గడగడలాంచిన కరోనా కష్టకాలంలోనే ఈవిషయం నిర్ణారణ అయిందంటున్నారు స్థానికులు. కరోనా సమయంలో ఈ బావి నీళ్లు తాగడం వల్ల ఊరిలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. దాంతో అప్పటి నుండి ఈ బావి నీళ్లకు ప్రచారం ఊపందుకుంది.అందుకే వేరే ప్రాంతాల నుంచి కూడా జనాలు అక్కడికి వచ్చి నీళ్ళను తాగేవాల్లు..

ఔషధ విలువలు ఉండటంతోనే నిజాం నవాబు ఈ బావి నీరు తాగే వారని చెబుతుంటారు. ఇప్పటికీ నల్లాల ద్వారా ఇంటింటికీ తాగు నీరు అందుతున్నప్పటికీ .. మొలంగూరు గ్రామస్థులు ఆ బావి నీరే తాగుతుండటం విశేషంగా చెప్పుకోవాలి. నీటి ప్రతేకత ఏంటో తెలుసుకోవడానికి జలవనరుల సంస్థ కూడా పరిశోధనని కూడా మొదలు పెట్టినట్లు తెలుస్తుంది..కరీంనగర్ నుండి వరంగల్ బస్ ఎక్కి కథలాపూర్ ఎక్స్ రోడ్డు వద్ద దిగాలు. అక్కడి నుండి మోలగూర్‌ వెళ్ళే బస్సు ఎక్కితే సరిపోతుంది. ఇక వరంగల్ నుండి అక్కడికి వెళ్లాలనుకునే వారు వరంగల్లో బస్సు ఎక్కి కథలపూర్ ఎక్స్ రోడ్డు వద్ద దిగి అక్కడి నుండి మోలాగూర్ బస్సు ఎక్కితే సరిపోతుంది. కార్ బైక్ పై వెళ్ళేవారికి కూడా సేమ్ రూట్‌లో వెళ్లాల్సి ఉంటుంది..ఇలాంటి అద్భుతమైన ఔషదాలు కలిగి ఉన్న బావి ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా మార్చాలని అక్కడి వాళ్ళు కోరుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news