వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్సీపీనే: నటుడు అలీ

-

వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వచ్చేది వైఎస్సార్సీపీనే అని ధీమా వ్యక్తం చేశారు నటుడు అలీ. వైయస్సార్సీపి ప్రభుత్వం ఏర్పాటై మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఆస్ట్రేలియాలోని ప్రవాసాంద్రులు నిర్వహించిన మహాగర్జన లో నటుడు అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జగన్ పాలన పై ప్రశంసలు గుప్పించారు. ముఖ్యమంత్రి జగన్ అద్భుతమైన పాలనను అందిస్తున్నారని, ఆయన అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని కితాబిచ్చారు.

అవినీతికి తావు లేకుండా ప్రజల వద్దకే సంక్షేమ పాలనను అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డిదని ఆయన కొనియాడారు. కాగా మొన్నటి రాజ్యసభ ఎన్నికల్లో నటుడు అలీకి సీటు దక్కుతుందని అందరూ భావించారు. కానీ అలీకి మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. కానీ అలీ రాజకీయంగా తనను వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తీర్చిదిద్దారని, నేను రాజ్యసభ సీటు ఆశించలేదని అన్నారు. ఎప్పుడు ఏమి ఇవ్వాలో జగన్ కు బాగా తెలుసు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news