ఇదేక్కడి చోద్యం రా నాయనా.. అక్కడ జైల్లో ఫుడ్ ఆర్డర్ చేసుకోని తినాలట..

-

కొన్ని హోటల్స్‌ లో కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి..భోజన ప్రియులను ఆకట్టుకోవడంలో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు.రుచిలో కాంప్రమైజ్ అవ్వడం లేదు..మొన్న ట్రైన్ సర్వీసు, నిన్న రోబోలతో సర్వీసు చేశారు.ఇప్పుడు మరో కొత్త ఫుడ్ కోర్టు గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకు వచ్చాయి.అచ్చం సెంట్రల్‌ జైలు ఎలా ఉంటుందో.. అడుగడుగునా అలానే అనిపిస్తుంది. అక్కడ హోటల్ బేరర్స్ కు బదులు.. ఖైదీలే వెల్‌కమ్‌ చెప్పి లోపలకు తీసుకెళ్తారు. అంతే కాదు సెల్ లోకి కూడా తీసుకెళ్తారు. భయపడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఆ కటకటాల వెనక పసందైన రుచులతో ఫుడ్ మెనూ ను టేబుల్ పై పెట్టి అతిథి మర్యాదలు చేస్తారు.

ఆ సెల్ లో పెట్టి తాళం వేస్తారు. ఏం నేరం చేశాము బాబోయ్‌, ఏంటిది అనుకుని కంగారుపడే లోపల.మరో ఖైదీ వచ్చి మీకేం కావాలో ఆర్డర్‌ ప్లీజ్‌ అంటాడు. అదే ఈ జైలు స్పెషల్.. ఎందుకంటే ఈ రోజుల్లో పుడ్ లవర్స్ వింత వింత అనుభూతులు కోరుకుంటారు. కాస్త కొత్తధనం ఉంటూనే రెస్టారెంట్ లోకి అడుగుపెట్టాలి అనుకుంటారు. సామాన్యులకు ఆ ఫీల్ కలిగించే కాస్త ఆకట్టుకునే ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో ఈ జైల్ యాంబియన్స్‌ను ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు.

అక్కడ రుచులు, డిఫరెంట్ డిష్ లు కూడా ఉంటాయి.సూప్స్‌, స్టార్టర్స్‌, బిర్యానీ మెయిన్‌ కోర్స్‌, రైస్‌ మెయిన్‌ కోర్స్‌, బిర్యాని మండి, ఫ్యామిలీ ప్యాక్స్‌, జంబో బిర్యానీ మండీ, బేవరేజెస్‌.ఇక్కడ అన్నిరకాల వాళ్లకు రుచికరమైన భోజనం దొరుకుతుంది. ఇక్కడ మిక్స్‌డ్‌ నాన్‌వేజ్‌ మండి రూ.1699.ఇదే ఇక్కడ ఉన్న ఫుడ్‌లలో హైకాస్ట్‌ ఫుడ్‌..ఏడు నెలల క్రితం ప్రారంభించిన ఈ ఫుడ్ జైల్ రెస్టారెంట్‌కు విశేష ఆదరణ లభించిందని , నగర వాసులతో పాటు ఇతర జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి జైలు వాతవరణాన్ని ఎంజాయ్‌ చేస్తూ. వాళ్లకెంతో ఇష్టమైన బిర్యానీలను తింటున్నారు. తమ వద్ద అన్ని రకాల స్టార్ట్స్ తో పాటు చికెన్ మటన్, సీ ఫుడ్ లభిస్తాయి.

కొత్త థ్రిల్ ఫీల్ అవ్వాలి అనుకోనేవారికి బెస్ట్ చాయిస్..ఈ రెస్టారెంట్ అడ్రెస్..

E3 ఫుడ్‌కోర్టు, PNBS ఎదురుగా, ఏపీఎస్‌ఆర్టీసీ బస్టాండ్‌, కృష్ణలంక, విజయవాడ, ఆంధ్రప్రదేశ్‌ – 520013. ఫోన్‌ నెంబర్‌: . 9330123499..

టైమింట్స్‌: మధ్యాహ్నం 1 నుంచి రాత్రి 11.30 వరకు తెరిచి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news