ఏపీ ముస్లింలకు షాక్..దుల్హన్ పథకం ఎత్తివేసిన జగన్ సర్కార్ !

-

ఏపీ ముస్లిం లకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది జగన్ సర్కార్. దుల్హన్ పథకాన్ని నిలిపివేస్తున్నామని తాజాగా జగన్ సర్కార్ ప్రకటించింది. నిరుపేద ముస్లిం మైనార్టీ యువతులకు… వివాహ సందర్భంగా ఆర్థిక సహాయం అందించేందుకు తీసుకువచ్చిన ఈ పథకాన్ని నిలిపివేస్తున్నామని ఏపీ హైకోర్టు తాజాగా జగన్ సర్కార్కు తెలిపింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ పథకం అమలులో లేదని వెల్లడించింది.

టిడిపి ప్రభుత్వం హయాంలో దుల్హన్ పథకం కింద పేద ముస్లిం మహిళల వివాహానికి 50 వేల రూపాయలు అందజేసింది. అయితే.. ఈ దుల్హన్ పథకం అమలుపై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఈ పథకం అమలకు నిధులు లేవని హైకోర్టు ధర్మాసనం ముందు చెప్పారు ఏపీ ప్రభుత్వ న్యాయవాది. మైనారిటీ హక్కుల పరి రక్షణ సమితి నేత షిబ్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. ఈ పథకం అమలు చేయడం లేదని ఈ పిటిషన్లో పేర్కొన్నారు షిబ్లీ. ప్రభుత్వ అఫిడవిట్లపై రిప్లై దాఖలు చేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాదిని ఈ సందర్భంగా ఆదేశించింది హై కోర్టు.

Read more RELATED
Recommended to you

Latest news