దే దే ప్యార్ దే సినిమాలో రకుల్ ప్రీత్ అందాలను బాగానే ఆరబోసిందట. వడ్డి షరాబాన్ అనే పాటలో కొన్ని సీన్లు మరీ అసభ్యంగా ఉన్నాయని చెప్పి సెన్సార్ కూడా వాటికి కత్తెర వేసిందట.
సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే.. కేవలం అందాలను ఆరబోస్తేనే చాలదు.. చక్కని నటన ప్రదర్శించాలి. సినిమాలో మంచి కథ ఉండాలి. అప్పుడే ప్రేక్షకులకు సినిమా కనెక్ట్ అవుతుంది. అది లేకుండా.. సినిమాలో హీరోయిన్లతో ఎంత ఎక్స్‌పోజింగ్ చేయించినా ఫలితం ఉండదు. అయితే నేటి తరుణంలో కొందరు నటీమణులు మాత్రం సినిమాల్లో అందాల ఆరబోతతో రాణించవచ్చని భ్రమిస్తున్నారు. కానీ నిజానికి సినిమాల్లో చేయాల్సింది ఎక్స్‌పోజింగ్ కాదు. ఎక్స్‌పోజింగ్ చేయకుండానే ఎంతో మంది నటీమణులు సినిమాల్లో నటించి ప్రేక్షకులను రంజింపజేశారు. అయితే ఇవేవీ తెలియని రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం అందాల ఆరబోతతో సినిమాల్లో రాణించవచ్చనే ధీమాలో ఉన్నట్లు కనిపిస్తుంది.
అయితే సినిమాల్లో ఎంత అందాలను ఆరబోసినా.. ప్రేక్షకులకు ఆ సినిమా నచ్చకపోతే వారు దాన్ని తిరస్కరిస్తారు. ఈ క్రమంలోనే తాజాగా విడుదలైన దే దే ప్యార్ దే చిత్రం కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుందని చెప్పవచ్చు. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ ఎన్ని అందాలను ఆరబోసినా.. సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అజయ్ దేవగన్, టబు వంటి ప్రముఖ నటులు ఇందులో నటించినా.. కలెక్షన్లను రాబట్టడంలో ఈ సినిమా విఫలమైంది. దీంతో బాలీవుడ్‌లో సెటిల్ అవుదామనుకున్న రకుల్ కల ఇప్పట్లో నెరవేరేలా కనిపించడం లేదు.
దే దే ప్యార్ దే సినిమా ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రాగా బాక్సాఫీస్ వద్ద పేలవమైన కలెక్షన్లను సాదించింది. దీంతో చిత్ర నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు. నిన్న ఫస్ట్ షో, సెకండ్ షోలకే కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. ఈ క్రమంలో ఇవాళ, రేపు సినిమా ఎంత కలెక్షన్ సాధిస్తుందోనని వారు ఆందోళనకు లోనవుతున్నారు. కాగా ఈ సినిమాలో నటించిన రకుల్ ప్రీత్ సింగ్ కు అయితే మళ్లీ చేదు అనుభవమే ఎదురైంది. గతంలో యారియాన్, ఐయారీ చిత్రాల్లో నటించిన రకుల్‌కు ఆ సినిమాలు ఆశించిన విజయాలను అందివ్వలేకపోయాయి. ఇక ఇప్పుడు విడుదలైన దే దే ప్యార్ దే కూడా సక్సెస్ కాలేదు. దీంతో బాలీవుడ్ లో ఇక సెటిల్ కాలేమోనని రకుల్ ప్రీత్ సింగ్ ఆందోళన చెందుతున్నట్లు సమాచారం.
నిజానికి దే దే ప్యార్ దే సినిమాలో రకుల్ ప్రీత్ అందాలను బాగానే ఆరబోసిందట. వడ్డి షరాబాన్ అనే పాటలో కొన్ని సీన్లు మరీ అసభ్యంగా ఉన్నాయని చెప్పి సెన్సార్ కూడా వాటికి కత్తెర వేసిందట. ఇక హై సొసైటీ కామెడీ, అడల్డ్ కంటెంట్ జనర్‌లలో వచ్చిన ఈ సినిమాను ఫ్యామిలీ ప్రేక్షకులు అస్సలు ఏమాత్రం చూడలేరట. అందుకనే ఈ సినిమా ఫ్లాప్ టాక్‌ను సొంతం చేసుకుని ఉంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా.. వర్ధమాన నటీమణులు మాత్రం.. అందాల ఆరబోతే పరమావధిగా కాకుండా, మంచి కథ ఉన్న సినిమాలను కూడా చేస్తేనే వారికి ఎక్కడైనా గుర్తింపు లభిస్తుంది. లేకపోతే.. ఇదిగో ఇలాగే జరుగుతుంది..!