క్రికెట్ అన్నాక బ్యాట్స్‌మెన్ అందులో ఔటవ్వడం సాధారణమైన విషయమే. అయితే పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ మాత్రం వింతగా అవుటయ్యాడు. అతను ముందుకు దూసుకువచ్చిన బంతిని కొట్టబోయి వికెట్లను బాదాడు.
క్రికెట్ మ్యాచుల్లో సాధారణంగా అత్యంత వింతైన సంఘటనలు అప్పుడప్పుడు చోటు చేసుకుంటూ ఉంటాయి. ప్లేయర్లు కావచ్చు, మైదానంలో ఆటను చూస్తే వీక్షకులు కావచ్చు.. ఎవరి పరంగా అయనా సరే.. క్రికెట్ మ్యాచుల్లో జరిగే ఫన్నీ సంఘటనలు అందరికీ నవ్వు తెప్పిస్తుంటాయి. ఈ క్రమంలోనే ఆ సంఘటనల తాలూకు వీడియోలు కూడా నెట్‌లో వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా జరిగిన ఓ మ్యాచ్‌లోనూ అలాంటి ఓ వింతైన ఘటనే చోటు చేసుకోగా దానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ.. అసలు ఏం జరిగిందంటే…
క్రికెట్ అన్నాక బ్యాట్స్‌మెన్ అందులో ఔటవ్వడం సాధారణమైన విషయమే. అయితే పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ మాత్రం వింతగా అవుటయ్యాడు. అతను ముందుకు దూసుకువచ్చిన బంతిని కొట్టబోయి వికెట్లను బాదాడు. దీంతో అతను హిట్ వికెట్ రూపంలో అవుటయి పెవిలియన్ బాట పట్టాడు. ఇంగ్లండ్‌లో ట్రెంట్ బ్రిడ్జ్ మైదానంలో ఇంగ్లండ్ తో నిన్న జరిగిన వన్డే మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ మార్క్‌వుడ్ వేసిన 47వ ఓవర్ మొదటి బంతిని పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ఫోర్ గా మలిచాడు. అనంతరం 2, 3 బంతులకు వరుసగా 2 చొప్పున మొత్తం 4 పరుగులు తీశాడు. అనంతరం 4వ బంతిని షోయబ్ మాలిక్ ఆడబోయి వెనక్కి జరిగి వికెట్లను కొట్టాడు. దీంతో అతను హిట్ వికెట్ అయ్యాడు.
Don't see this too often!
Scorecard & Videos: https://t.co/A8uZh11q6U#EngvPak pic.twitter.com/HxUAK2A5qG
— England Cricket (@englandcricket) May 17, 2019
ఇలా షోయబ్ అవుట్ కాగానే మైదానంలో ఉన్న ఆటగాళ్లు కూడా షాక్‌కు గురయ్యారు. అయితే ఇలా షోయబ్ మాలిక్ ఫన్నీగా ఔటవడం నెటిజన్లను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో ఆ వీడియోను వారు సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. వికెట్లను కాదు, బంతిని కొట్టడం నేర్చుకో షోయబ్.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా.. షోయబ్ మాలిక్ ఔటైన తీరు మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది..!