ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ వర్సెస్ టిడిపి గా సాగుతున్న వార్ ఇప్పుడు ట్వీట్ల రూపంలో మరింతగా ముదిరిపోయింది. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పెడుతున్న ట్వీట్ల పై గతంలో అప్పుడప్పుడు స్పందించే టిడిపి నేతలు ఇప్పుడు ఎన్నికల వాతావరణంతో రోజు స్పందిస్తున్నారు. అంతేకాదు విజయసాయిరెడ్డి వాడుతున్న భాషకు నాలుగింతలు సూచనలతో ఆయనను ఇరిటేట్ చేస్తున్నారు. దీంతో వీరి ట్వీట్ల వార్ రాబోయే రోజుల్లో ఏ స్థాయికి వెళ్తుందో అర్థం కావడం లేదు.
తాజాగా అయ్యన్నపాత్రుడు పై విజయసాయిరెడ్డి చేసిన కామెంట్ కు అయ్యన్న స్పందిస్తూ.. “బెయిల్ కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టడానికి ఢిల్లీ వెళ్లిన విజయసాయిరెడ్డి.. తనని విమర్శించడం విడ్డూరంగా ఉందని ట్వీట్ చేశారు అయ్యన్నపాత్రుడు. తాను అజ్ఞాతంలో ఉన్నానడం అవాస్తవమని.. నర్సీపట్నం లోనే ఉన్నాను అని తెలిపారు. విజయసాయిరెడ్డి పులి అయితే పోలీసుల్ని వేసుకొని రాడని.. సింగిల్ గానే రావాలని సవాల్ చేశారు. విజయసాయి రెడ్డి 16 నెలల పాటు జైల్లో భోజనం తినడం వల్ల శరీరం మందపడింది అని ఎద్దేవా చేశారు. తోటి ఖైదీలు, ఖాకీల చేతిలో తిన్న దెబ్బల వలన ఏర్పడ్డ చారలు చూసుకొని విజయసాయిరెడ్డి పులిగా ఫీలవ్వడంలో తప్పులేదని అయ్యన్నపాత్రుడు విమర్శించారు.
అంత గొప్పగా ఉంది నీ ప్రభుత్వ సమాచార వ్యవస్థ. నేను నర్సీపట్నంలోనే ఉన్నా. ముహూర్తం ఎందుకు నువ్వు ఎప్పుడొచ్చినా నేను
రెఢీ. అన్నట్టు పులి అయితే పోలీసుల్ని వేసుకొని రాదుగా సింగిల్ గా రావాలి. అప్పుడు తేలిపొద్ది ఎవడు పులో ఎవడు పిల్లో!. 2/2@VSReddy_MP— Ayyanna Patrudu (@AyyannaPatruduC) June 25, 2022