రేపు హైదరాబాద్‌లోని ఎంఎంటీఎస్ రైళ్ల సర్వీసులను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారికంగా ప్రకటించింది. రద్దీ లేని మార్గాల్లో వీలైనంత వరకు సర్వీసులను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. ఆదివారం (జూన్ 26) పలు లోకల్ ట్రైన్స్ ను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్-లింగంపల్లి మార్గంలో 9 ఎంఎంటీఎస్ ట్రైన్లు, లింగంపల్లి-హైదరాబాద్ మార్గంలో 9 ఎంఎంటీఎస్ ట్రైన్లు, ఫలక్‌నూమా-లింగంపల్లి మార్గంలో 7, లింగంపల్లి-ఫలక్‌నూమా మార్గంలో 7, సికింద్రాబాద్-లింగంపల్లి మార్గంలో 1, లింగంపల్లి-సికింద్రాబాద్ మార్గంలో 1.. ట్రైన్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.
రద్దు చేసిన ట్రైన్ల వివరాలు:
హైదరాబాద్-లింగంపల్లి రూట్..
47105, 47109, 47110, 47111, 47112, 47114, 47116, 47118, 47120.
లింగంపల్లి-హైదరాబాద్ రూట్..
47129, 47132, 47133, 47135, 47136, 47137, 47138, 47139, 47140.
ఫలక్‌నూమా-లింగంపల్లి రూట్..
47153, 47164, 47165, 47166, 47203, 47220, 47170.
లింగంపల్లి-ఫలక్‌నూమా రూట్..
47176, 47189, 47210, 47187, 47190, 47191, 47192.
సికింద్రాబాద్-లింగంపల్లి రూట్..
47150, 47195.
"Cancellation of MMTS Services" @drmsecunderabad @drmhyb pic.twitter.com/KyGk9xzfS1
— South Central Railway (@SCRailwayIndia) June 25, 2022