కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అందుబాటులోకి తీసుకువచ్చిన పథకం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి.. ఈ పథకం కింద రైతులకు ప్రతి ఏటా 6000 నగదు అందుతుంది.ఇప్పటివరకు పదకొండు విడతలుగా రైతుల ఖాతాల్లోకి నగదు జమ చేసింది.విడతల వారిగా రూ. 2000 అందిస్తుంది. అయితే తాజాగా పీఎం కిసాన్ పథకంలో కొత్తగా నమోదు చేసుకునేవారికి కొత్త రూల్స్ అందుబాటులోకి తీసుకువచ్చింది కేంద్రం.. ఇకపై పీఎం కిసాన్ పథకంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఈ స్కీమ్ లో చేరేవారికి ఇకపై రేషన్ కార్డు తప్పనిసరి చేసింది..
ఈ పథకంలో నమోదు చేసుకునేటప్పుడు అన్నదాతలు తమ రేషన్ కార్డు కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అంతేకాదు.. లబ్దిదారులు EKYC పూర్తి చేసినప్పుడే పీఎం కిసాన్ డబ్బులు మీ ఖాతాలో పడతాయి.కొత్తగా అప్లై చేసుకొనే వాళ్ళు పోర్టల్ లో రేషన్ కార్డు నంబర్ ను నమోదు చేసి తర్వాత మాత్రమే భర్త లేదా భార్యలో ఒకరికి పీఎం కిసాన్ సమ్మాన్ నిధిలో రూ. 2000 పడుతుంది. ఇప్పుడు పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్ విధానంలో అనేక మార్పులు వచ్చాయి.. ఇప్పుడు రేషన్ కార్డు అవసరాలతోపాటు పత్రాల సాఫ్ట్ కాపీలు పోర్టల్లో అప్లోడ్ చేయాలి..
రేషన్ కార్డ్ నంబర్ లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఇకపై సాధ్యం కాదు.. అంతేకాకుండా ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్ బుక్, డిక్లరేషన్ హార్డ్ కాపీలను సమర్పించాల్సిన అవసరం లేదు.మిగిలిన పత్రాలను, కాగితాలను సంబంధిత కార్యాలయాల లో సమర్పించాలి.డాక్యుమెంట్స్ పీడీఎప్ ఫైల్ ను క్రియేట్ చేసి పోర్టల్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది..అప్పుడు సులువుగా అయిపోతుంది.-KYC అప్డేట్ చేయడానికి 31 జూలై 2022 చివరి తేదీ. PM కిసాన్ వెబ్‌సైట్ లో రైతులు ఇంట్లో కూర్చొని తమ స్మార్ట్‌ఫోన్‌ల నుండి కూడా eKYC అప్టేడ్ చేయవచ్చు..లేదా సమీప మీ సేవ లో కూడా చేసుకోవచ్చు..