BREAKING : 9 నెలల తర్వాత రాజ్ భవన్ కు వచ్చిన సీఎం కేసీఆర్

-

BREAKING : తెలంగాణ రాష్ట్ర రాజ్ భవన్ కు సీఎం కేసీఆర్ వచ్చారు. ఇవాళ ఉదయం హై కోర్టు చీఫ్ జస్టిస్ గా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 10. 05 నిమిషాలకు ఉజ్జల్ భూయాన్ తో ప్రమాణం చేయించనున్నారు గవర్నర్ తమిళ్ సై. ఈ కార్యక్రమం రాజ్‌ భవన్‌ లో జరుతుండటంతో… ఈ కార్యక్రమానికి హాజరు అయ్యారు సీఎం కేసీఆర్‌.

సుమారు 9 నెలల తర్వాత రాజ్ భవన్ కి సీఎం కేసీఆర్‌ వచ్చారు. అక్టోబర్ 11 న హై కోర్టు చీఫ్ జస్టిస్ గా సతీష్ చంద్ర ప్రమాణ స్వీకారానికి హాజరు అయ్యారు సీఎం కేసీఆర్‌. ఆ తరవాత మళ్లీ ఇప్పుడే రాజ్ భవన్ కి సీఎం కెసిఆర్ వచ్చారు. దీంతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు వేడేక్కాయి.

కాగా.. గత కొన్ని రోజులుగా.. గవర్నర్ తమిళ్ సై మరియు టీఆర్‌ఎస్‌ సర్కార్‌ ల మధ్య వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. గవర్నర్ తమిళ్ సై… తెలంగాణ సర్కార్‌ పై విమర్శలు చేయడం… ప్రధానికి ఫిర్యాదు చేయడం జరిగింది. వాటికి అంతే దీటుగా సర్కార్‌ నుంచి కౌంటర్‌ కూడా వెళ్లింది. అయితే.. ఇవాళ రాజ్ భవన్ కు సీఎం కేసీఆర్.. వెళ్లడంతో… గవర్నర్‌ తో వివాదం ముగుస్తుందో ? లేదో ? చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news