మెక్సికో-టెక్సాస్ సరిహద్దుల్లో దారుణ విషాదం కలకలం రేపుతోంది. ఒక ట్రక్కులో పదుల సంఖ్యలో మృతదేహాలు లభ్యమయ్యాయి. టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియోలోని ఒక ట్రక్కులో 46 మృతదేహాలను గుర్తించినట్లు లా ఎన్‌ఫోర్స్ మెంట్ అధికారి తెలిపారు. రైలు పట్టాల పక్కనే ఒక ట్రక్కును నిలిపివేసినట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు.
![టెక్సాస్-ట్రక్కు](https://cdn.manalokam.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-28-at-10.02.32-AM.jpeg)
అమెరికాలోని దక్షిణ టెక్సాస్‌కు అక్రమంగా వలస వెళ్లేందుకు ట్రక్కు ప్రయత్నించింది. ఈ క్రమంలోనే వీరు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు భావిస్తున్నారు. ట్రక్కులో మరో 16 మందిని శాన్ ఆంటోనియాలోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో నలుగురు చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఈ మేరకు కేసు నమోదు చేసుకుని ట్రక్కు డ్రైవర్‌ను విచారిస్తున్నామన్నారు. ట్రక్కులో 46 మంది ఎలా చనిపోయారనే విషయంపై దర్యాప్తు చేపడుతున్నామన్నారు. అయితే మెక్సికన్ సరిహద్దు నుంచి శాన్ ఆంటోనియోలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 36.4 డిగ్రీల టెంపరేచర్ ఉందని, ఈ క్రమంలో వలసదారులు మరణించి ఉంటారని అధికారులు భావిస్తున్నారు.