విద్యార్థులకు శుభవార్త.. రేపు పాలిటెక్నిక్ ఎంట్రెన్స్

-

రేపు పాలిటెక్నిక్ ఎంట్రెన్స్ (పాలీసెట్-2022) పరీక్ష జరుగనుంది. రాష్ట్రం లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ ల లోని 3 సంవత్సరాల ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులతో పాటుగా, వ్యవసాయ, ఉద్యానవన, వెటర్నరీ డిప్లొమా కోర్సుల ప్రవేశానికై ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. జూన్ 30వ తేదీన ఉ. 11.00 గం. నుండి మ. 1.30 వరకు పరీక్ష జరుగనుంది. ఇందు కోసం కోవిడ్-19 నిబంధనల ప్రకారం అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా 1,13,974 మంది అభ్యర్థులు 365 పరీక్ష కేంద్రాల లో హాజరవుతున్నారు. విద్యార్థులను పరీక్ష కేంద్రం లోనికి ఒక గంట ముందుగానే అనగా ఉదయం 10.00 గంటలకే అనుమతిస్తారు. కావున విద్యార్థులు ఉ. 10.00 గంటలకే పరీక్ష హాలులోకి చేరుకొని ఓఎంఆర్‌ షీట్ లోని రెండు వైపులలోని వివరాలు పూర్తి చేసి సంతకం చేయవలసి ఉంటుంది. విద్యార్థులు తమవెంట HB black పెన్సిల్, ఏరేసర్, బ్లూ లేదా బ్లాక్ బాల్ పెన్ తప్పక తీసుకొని రావలెను.

Telangana POLYCET results to be released today.

పరీక్ష ప్రారంభం ఐన (ఉ 11.00 గం.) తరువాత ఒక్క (1) నిమిషం ఆలస్యం అయినను అభ్యర్థిని పరీక్ష కేంద్రం లోనికి అనుమతించరు. హాల్ టికెట్ మీద ఫోటో ప్రింట్ కానివారు ఒక పాస్పోర్ట్ సైజు ఫోటో మరియు ఐడీప్రూఫ్ (ఆధార్ కార్డు) తెచ్చుకోవలెను. పరీక్ష కేంద్రంలోని సెల్ ఫోన్ కానీ, ఇతర ఎలక్ట్రానిక్స్ వస్తువులు అనుమతించబడవు. ఇంజనీరింగ్ డిప్లొమా చేయాలనుకునే వారు గణితం 60 మార్కులు, భౌతిక శాస్త్రం 30 మార్కులు, రసాయన శాస్త్రం 30 మార్కులకు పరీక్ష రాయవలసి ఉంటుంది. వ్యవసాయం, ఉద్యానవన, వేటరినరీ డిప్లొమా చేయాలనుకునే వారు అదనంగా జీవశాస్త్రం లో మరో 30 మార్కులకు పరీక్ష రాయవలసి ఉంటుంది. విద్యార్థులు COVID-19 నిబంధనలకు అనుగుణంగా మాస్కులు ధరించవలెనని అధికారులు సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news