హైదరాబాద్: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరుగుతున్న బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించారు. అయితే ఈ ప్రసంగంలో.. కెసిఆర్ అలాగే టిఆర్ఎస్ ప్రభుత్వం పై ప్రధాని నరేంద్ర మోడీ విమర్శలు చేస్తారని అందరూ ఊహించారు. కానీ.. అందరి ఊహలకు అనుగుణంగా కాకుండా… బిజెపి పార్టీ చేసిన అభివృద్ధిపైనే ప్రధాని మోడీ ప్రసంగం కొనసాగింది.
రాజకీయ విమర్శలు లేకుండానే ప్రసంగించిన ప్రధాని మోడీ…. కేసీఆర్ విమర్శలు, ప్రశ్నలకు జవాబివ్వని లేదు. టీఆర్ఎస్ ప్రస్తావన తీసుకురాని మోడీ… తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆదరించారని గుర్తు చేశారు. 2019 సంవత్సరం నుంచి తెలంగాణ రాష్ట్రంలో బిజెపి పార్టీ పుంజుకుంటూ ఉందని స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బిజెపి పార్టీ ముందుకు వెళుతూ ఉందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చాలా చేసిందని… తెలంగాణ గడ్డ చైతన్య వంతమైందని తెలిపారు ప్రధాని నరేంద్ర మోడీ.