కీరవాణి, రాజమౌళి ఇంటి పేర్లు వేరుగా ఉండటం వెనుక కారణమిదే!

-

అగ్రశ్రేణి దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణిల కాంబినేషన్ ఎంతటి సక్సెస్ ఫుల్ కాంబోనో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అన్నదమ్ములైన వీరి కాంబోలో వచ్చిన సినిమాలు అన్నీ బాక్సాఫీసు వద్ద రికార్డులు సృష్టించాయి.

mm keeravani
mm keeravani

దేశవ్యాప్తంగా రాజమౌళి పేరు RRR సినిమాతో మార్మోగిపోయింది. అంతకుముందే బాహుబలితో రాజమౌళి ట్రెండ్ క్రియేట్ చేశాడు. ఇక తాజాగా రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ను కేంద్రప్రభుత్వం రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేసింది. ఈ సంగతులు పక్కనబెడితే..అన్నదమ్ములైన కీరవాణి, రాజమౌళిల ఇంటి పేర్లు స్క్రీన్ పైన వేరుగా కనిపించడం వెనుక ఉన్న కథను గురించి తెలుసుకుందాం.

రాజమౌళి ఫాదర్ కేవి విజయేంద్రప్రసాద్..కాగా, కీరవాణి వాళ్ల నాన్న కోడూరు శివశక్తి దత్త. అలా వీరి సంతానానికి కోడూరి అనే పేరు మాత్రమే ఇంటి పేరుగా ఉంటుంది. కాగా, రాజమౌళి, కీరవాణి మాత్రం అలా కాకుండా వేరే విధంగా తమ పేర్లను ప్రమోట్ చేసుకున్నారు. ఎం.ఎం.కీరవాణి, ఎస్.ఎస్.రాజమౌళి ..అని పెట్టుకుంటారు.

అందుకు కారణమేమిటంటే..కీరవాణి అసలు పేరు అనగా పూర్తి పేరు..‘మరకతమణి కీరవాణి’. రాజమౌళి పూర్తి పేరు ‘శ్రీశైలం రాజమౌళి’..అలా వారి పేర్ల ముందరున్న అక్షరాలను సింప్లిఫై చేసుకునే క్రమంలో ‘ఎస్.ఎస్.రాజమౌళి’,‘ఎం.ఎం.కీరవాణి’ అనే పేర్లొచ్చాయి. రాజమౌళి RRR తర్వాత సినిమాను టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుతో చేయనున్నారు. ఈ క్రమంలోనే ఈ ఫిల్మ్ కోసం స్టోరి డిస్కషన్స్ ను దర్శక ధీరుడు స్టార్ట్ చేసినట్లు టాక్.

Read more RELATED
Recommended to you

Latest news