కేంద్రం గుడ్‌న్యూస్: వీరికి ఉచితంగా బూస్టర్ డోస్.. ఎప్పటి నుంచి అంటే?

-

కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. కరోనా వ్యాక్సినేషన్‌పై కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల దేశవ్యాప్తంగా కరోనా ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. 18 నుంచి 59 ఏళ్లలోపు వారికి ఉచితంగా మూడో డోస్(బూస్టర్ డోస్) పంపిణీ చేయడానికి సిద్ధమైంది. దీని కోసం కేంద్ర ఆరోగ్య శాఖ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనుంది. 75 రోజులపాటు ఈ ప్రత్యేక కార్యక్రమం కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. అలాగే ఈ నెల 15వ తేదీ నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు.

బూస్టర్ డోస్
బూస్టర్ డోస్

ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా బూస్టర్ డోస్ పంపిణీ చేయడానికి కేంద్రం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ కేంద్రాల్లో ఉచితంగా టీకా పంపిణీ చేయనున్నారు. అయితే ఇప్పటివరకు చాలా మంది ప్రజలు రెండో డోసు వ్యాక్సిన్ తీసుకున్న వారే. అయితే రెండో డోసు వారిలో ఆరు నెలల తర్వాత వ్యాక్సిన్ వల్ల పొందే యాంటీబాడీలు క్షీణిస్తున్నాయని భారత వైద్య పరిశోధన మండలి తెలిపింది. ఈ క్రమంలోనే బూస్టర్ డోస్ ప్రజలకు ఇవ్వడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. అందుకే 18 ఏళ్లు పైబడిన వారికి బూస్టుర్ డోస్ ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రకటన జారీ చేసింది. ప్రతిఒక్కరూ తప్పనిసరిగా బూస్టర్ డోస్ వ్యాక్సిన్ వేసుకోవాలని కేంద్రం సూచించింది.

Read more RELATED
Recommended to you

Latest news