మన దేశంలో ఈ మధ్య కొత్త పంటలకు రైతులు శ్రీకారం చుడుతున్నారు.అందులో పూల పంటలతో మంచి ఆదాయం రావడంతో ఎక్కువ మంది రైతులు ఇటు వైపు మొగ్గు చూపిస్తున్నారు.పూల సాగుతో బాగా ఆదాయం వస్తుంది. అందులోనూ కాస్త వెరైటీ పాలను పండిస్తే.. లాభాలు బాగా వస్తాయి. మనదేశంలో చాలా మంది రైతులు గెర్బెరా పూలను సాగుచేస్తే.. లక్షల్లో డబ్బు సంపాదించవచ్చు..
కొన్ని రాష్ట్రాలు హార్టికల్చర్ మిషన్ కింద గెర్బెరా పూల సాగును ప్రోత్సహిస్తున్నాయి. గెర్బెరా పూలను సాగుచేసే రైతులకు డ్రిప్, మల్చింగ్, హాఫ్ హెచ్‌పీ మోటార్ పంపు, షేడ్ నెట్ ఉచితంగా అందజేస్తున్నారు. గెర్బెరా పువ్వుకు మార్కెట్లో మంచి ధర లభిస్తోంది. అంతేకాదు ఈ పంట సాగుకు పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదు. షేడ్ నెట్లో గెర్బెరా పూలను సాగు చేయాల్సి ఉంటుంది. 30X30 మీటర్ల షేడ్ నెట్లో 3200-3300 వరకు గెర్బెరా మొక్కలను నాటవచ్చు. ఈ మొక్కలు 90 రోజుల తర్వాత పుష్పించడం ప్రారంభిస్తాయి. ఒక్క పూలలు దశకు వచ్చాక భారీగా ఆదాయం వస్తుంది. ఈ మొక్కలు పెద్ద ఎత్తున పువ్వులను ఇస్తాయి. ఒక నెలలో 10 సార్లు పువ్వును తీయవచ్చు. ప్రతిరోజూ 700-800 పూలను షేడ్ నెట్ నుండి కోయవచ్చు..
మార్కెట్ లో వీటి ధర 5 నుంచి 6 రూపాయలు కూడా పలుకుతుంది..రోజుకు 700 పూలువస్తే..రైతుకు 3,500 వరకు ఆదాయం వస్తుంది. 10 రోజుల సంపాదన రూ. 35000 వరకు డబ్బులు వస్తాయ. దీని సాగుకు 5000 రూపాయల వరకు ఖర్చవుతాయి. ఈ ఖర్చుపోగా.. నెలకు 30,000 ఆదాయం వస్తుంది. ఆరు నెలల్లో 1,80,000 రూపాయలు వరకు సంపాదించవచ్చు. గెర్బెరా పూల సాగు చేసే రైతులు.. మొక్కలకు నీటిని పెట్టేందుకు సమయం కేటాయించాలి. షేడ్ నెట్‌కు ఎప్పటికప్పుడు మరమ్మతులు చేస్తూ ఉండాలి. వీటి కింద మొక్కలను పెంచడం వల్ల దుమ్మ, ఇతర తెగుళ్ల బాధలు ఉండవు..అయితే రైతులు కాస్త కష్టపడాలి..అప్పుడే మంచి లాభాలను పొందుతారు..ఎప్పుడూ ఇదే కాకుండా వేరే పంటలను కూడా సాగు చేయవచ్చు..