సాధారణంగా ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే హీరోల హవా ఎక్కువగా కొనసాగుతుందని చెప్పడంలో సందేహం లేదు. కానీ హీరోయిన్ల విషయానికి వస్తే మాత్రం ఈ విషయంలో కాస్త విభిన్నంగా ఉంటుంది. ఎందుకంటే హీరోయిన్లు ఒకటి రెండు సంవత్సరాలకే ఫేడ్ అవుట్ అవుతూ ఇండస్ట్రీకి దూరం అవుతూ ఉంటారు. మరికొంతమంది తమ వయసు 40 సంవత్సరాలు దాటినా ఇండస్ట్రీలోనే కొనసాగుతూ ఉండడం గమనార్హం. ఇకపోతే కొంతమంది ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తొలి రోజుల్లో మంచి ఇమేజ్ను సొంతం చేసుకొని, ఒక వెలుగు వెలిగిన వారు ఆ తర్వాత సినిమాలకు దూరం అయి తమ అభిమానులకు నిరాశను మిగిల్చారు. ఆ తర్వాత వీరు ఎక్కడున్నారు? ఏమైపోయారు ?అనే విషయం కూడా చాలామందికి తెలియదనే చెప్పాలి. ఇక సోషల్ మీడియా పుణ్యమా అని కొంతమంది తమ ఫోటోలను అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతున్నారు.
ఇకపోతే మరి కొంతమంది వివాహం చేసుకొని పూర్తిగా సినీ ప్రపంచానికి దూరంగా ఉంటూ ఫిజిక్ ని కూడా పట్టించుకోకుండా గుర్తుపట్టలేనంతగా మారిపోతున్నారు. ఇక అలాంటి వారిలో రక్షిత, రాశి, మధుబాల, సరిత, మనిషా లాంటి వారు కూడా ఈ కోవలోకే వస్తారు. ఎందుకంటే వారు విపరీతంగా బరువు పెరిగిపోయి తమను తాము ప్రేక్షకులకు పరిచయం చేసుకోవాల్సిన గత్యంతరం పట్టింది. కానీ వీరిలో కొంతమంది పూర్తిగా బరువు తగ్గి మళ్ళీ పూర్వపు రూపంలోకి రావడం జరిగింది. ఇక తర్వాత మరికొంతమంది సినిమాలలో ఉన్నప్పుడు డబ్బు పరంగా జాగ్రత్త వహించక ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్న వారు కూడా ఉన్నారు. ఇక ప్రస్తుతం ఇలా రెండు జాబితాలలో ఒక స్టార్ హీరోయిన్ చేరిపోయింది.
ఆమె ఎవరో కాదు ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాతో మనీషా పాత్రలో ప్రేక్షకులను అలరించి ప్రేక్షకులను మెప్పించిన ముద్దుగుమ్మ వినీత గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాలో నేపాలి అమ్మాయిగా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది.. ఇక తన గ్లామర్ తోనే కాకుండా ఎన్నో ఎమోషనల్ సన్నివేశాలలో కూడా వినీత కనబరిచిన నటన ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించింది. ఇక తెలుగులో అవకాశాలు రాకపోవడంతో కోలీవుడ్, హిందీ, మలయాళం వంటి భాషా సినిమాలు చేసినా కూడా ఈమెకు కలిసి రాలేదు. ఇక ఆర్థికంగా ఎదుర్కొంటూ దయనీయ స్థితిలో చేరుకున్న ఈమె ఇక పూర్తిగా బరువు పెరిగిపోయింది. ఇటీవల ఈమెను చూసి ప్రజల సైతం ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు ప్రస్తుతం ఎక్కడ ఉంది? ఏం చేస్తోంది? అని కూడా ఆరా తీయడం గమనార్హం.