తెలంగాణలోని ధాన్యం సేకరణపై ఇంకా టీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. తాజాగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. తెలంగాణలో వడ్లు, బియ్యం సేకరణ చేయాలని ఎఫ్‌సీఐకి అనుమతి ఇచ్చామని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతారాహిత్యంతో వ్యవహరించిందని ఆయన ఆరోపించారు. పేదలకు బియ్యం అందకుండా అన్యాయం చేసిందని, నన్ను, ప్రధానిని అవమానకరంగా తిట్టారన్నారు.
ఏప్రిల్, మే నెలలో బియ్యం ఇవ్వకుండా పేదలకు అన్యాయం చేశారని, రైస్ మిల్లులో అక్రమాలు జరిగాయన్నారు. అందుకే మేము ఈ చర్యలు తీసుకోన్నామని, మా చర్యల వల్ల ఇప్పుడు బియ్యం సరఫరా చేస్తున్నారని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తప్పులకు రైతులను బలి చేయడం సరి కాదని ఆయన హితవు పలికారు. ఎఫ్‌సీఐకి ఆదేశాలు ఇచ్చామని వెంటనే వడ్లు బియ్యం సేకరణకు అనుమతి ఇస్తున్నామన్నారు.