కేంద్ర ప్రభుత్వం రైస్ మిల్లర్ల దగ్గర ఉన్న బియ్యాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనుగులు చేయడం లేదని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ధాన్యం కొనాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. రైతులు నష్ట పోతున్నారని, పేదలకు ఇవ్వాల్సిన ఉచిత బియ్యం 3నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది పంపిణీ చేయడం లేదని కిషన్‌రెడ్డి వెల్లడించారు. నేను సివిల్ సప్లై అధికారుల తో మాట్లాడాను ఇంకా ఆదేశాలు రాలేదు అని అన్నారన్నారు.
పేదలకు ఇవ్వాల్సిన ఉచిత బియ్యాన్ని రాష్ట ప్రభుత్వం దగ్గర పెట్టుకొని పంచడం లేదని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి ఢిల్లీలో ధర్నా ఎందుకు చేశారో తెలియడం లేదు. నూకలు కొంటామని కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది,కమిటీ వేసింది ఇప్పటి వరకు ఏమి కాలేదు. దేశంలోఎక్కడ లేని సమస్య తెలంగాణలో ఎందుకు వస్తుంది. రానున్న రోజుల్లో రైస్ డిస్ట్రిబ్యూషన్,ప్రోక్యూర్మెంట్ చేయాలని రాష్టాలతో ,రైస్ మిల్లర్ల తో మాట్లాడాము. రైస్ మిల్లర్లు అక్రమాలు చేశారు కేసులు
నమోదు అయ్యాయి,రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు.