తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ దూసుకుపోతుంది. టీఆర్‌ఎస్ పార్టీకి వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు చేస్తోంది. ఇక తాజాగా ప్రజాగోస – బీజేపీ భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సిద్దిపేటకు బయలు దేరారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. మరికాసేపట్లో సిద్దిపేట కు చేరుకోనున్న బండి సంజయ్… ప్రజాగోస – బీజేపీ భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
సిద్దిపేట లోని నాంచార్ పల్లి గ్రామంలో బైక్ ర్యాలీ ని ప్రారంభించనున్నారు బండి సంజయ్. పది రోజుల పాటు బైక్ ల పై గ్రామాల్లో పర్యటించి వివిధ వర్గాల ప్రజలతో సమావేశం కానుంది బీజేపీ నాయకత్వం. సిద్దిపేట లో బైక్ ర్యాలీ అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్న బండి సంజయ్. అనంతరం వేముల వాడ బయలుదేరనున్న బండి సంజయ్… వేములవాడ నియోజకవర్గం లోని ఫాజుల్ నగర్ లో బైక్ ర్యాలీ ని ప్రారంభించనున్నారు. ఆ తర్వాత తెలంగాణ వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగనుంది.