ఏపీ ఆశా వర్కర్లకు శుభవార్త.. భారీగా పెరిగిన జీతాలు

-

ఆశా వర్కర్ల జీతాలు 3 వేలే ఉన్నాయి. దాన్ని 10 వేలకు పెంచాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖపై సీఎం జగన్ ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్లకు జీతాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చి ఇంకా వారం కూడా కాలేదు కానీ.. అప్పుడే ఏపీ అభివృద్ధిపై దృష్టి పెట్టారు. తన మొదటి సంతకమే వృద్ధాప్య పింఛన్లపై పెట్టిన జగన్.. తర్వాత పలు మార్పులను శ్రీకారం చుట్టారు.

సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర్నుంచి క్షణం తీరిక లేకుండా.. ఏపీ పాలనపై దృష్టి పెట్టారు. తాజాగా ఏపీ ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. ఆశా వర్కర్ల వేతనాలను పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.ఆశా వర్కర్ల జీతాలు 3 వేలే ఉన్నాయి. దాన్ని 10 వేలకు పెంచాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖపై సీఎం జగన్ ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్లకు జీతాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

పేదలకు ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా మెరుగైన వైద్య సేవలు అందాలి..

పేద ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా మెరుగైన వైద్య సేవలు అందాలని.. అదే తమ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని సీఎం అన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో ఉన్న అవినీతిని రూపుమాపి.. ప్రభుత్వ ఆసుపత్రులను కార్పొరేట్ ఆసుపత్రుల్లా తీర్చిదిద్దాలన్నారు. దాని కోసం వైద్య ఆరోగ్య శాఖనే ప్రక్షాళన చేయాలన్నారు. అందుకు ఆరోగ్య నిపుణులతో కలిసి కమిటీ ఏర్పాటు చేస్తామని.. ఆ కమిటీ సమన్వయ బాధ్యతలను సీఎం ఆఫీసు నుంచి ప్రభుత్వం ప్రత్యేక కార్యదర్శి రమేశ్ చూస్తారని సీఎం స్పష్టం చేశారు. వైద్యఆరోగ్య శాఖ అధికారులతో కమిటీ చర్చలు జరిపి.. 45 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని సీఎం ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news