Breaking : తెలంగాణకు మూడు రోజులు అతిభారీ వర్షసూచన

-

తెలంగాణను వర్షాలు వీడనంటున్నాయి. రానున్న మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు ఈశాన్య, ఉత్తర తెలంగాణ జిల్లాలకు రెడ్‌ అలెర్ట్ జారీ చేసినట్లు తెలిపింది. రాగల నాలుగు వారాల పాటు వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని పేర్కొంది వాతావరణ కేంద్రం. హైదరాబాద్‌ పరిసర జిల్లాల్లో భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ కేంద్రం. ఇప్పటికే సాధారణ వర్షపాతం కంటే అత్యధికంగా నమోదైందని.. నిజామాబాద్‌ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు వెల్లడించింది వాతావరణ శాఖ.

IMD issues red alert for several Telangana districts, heavy rain forecast  for next 48 hours - India News

భారీ వర్ష సూచన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ఎగువ నుంచి గోదావరి నదిలోకి మళ్లీ వరద నీరు వచ్చే సూచనలు ఉండటంతో.. గోదావరి పరీవాహక ప్రాంత మంత్రులు, ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మంత్రులు, ప్రజాప్రతినిధులు ఆయా నియోజకవర్గాల్లో అందుబాటులో ఉండాలన్నారు సీఎం కేసీఆర్‌.

Read more RELATED
Recommended to you

Latest news