గ్రేటర్లో కమలం కొత్త ఎత్తు..పవన్ సపోర్ట్?

-

తెలంగాణలో బీజేపీ బలం రోజురోజుకూ పెరుగుతుందని సంగతి తెలిసిందే…అనూహ్యంగా బీజేపీ పుంజుకుంటూ వస్తుంది…ముఖ్యంగా జి‌హెచ్‌ఎం‌సి పరిధిలో బీజేపీ ఫుల్ గా పికప్ అయింది. గత జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల్లో టీఆర్ఎస్ కు చుక్కలు చూపించిన విషయం తెలిసిందే..దాదాపు టీఆర్ఎస్ ని ఓడించినంత పనిచేసింది. అయితే ఈ సారి సాధారణ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో సత్తా చాటాలని బీజేపీ చూస్తుంది.

గ్రేటర్ పరిధిలో ఎం‌ఐ‌ఎం ఏడు సీట్లు వదిలిపెట్టి…మిగిలిన సీట్లలో టీఆర్ఎస్ కు చెక్ పెట్టాలని కమలం ప్లాన్ చేస్తుంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఉన్న స్థానాలపై ఎక్కువ ఫోకస్ చేసింది. ఈ స్థానాల్లో ఖచ్చితంగా గెలవాలని భావిస్తుంది. ఈ క్రమంలోనే గ్రేటర్ లో ఎక్కువగా ఉన్న సెటిలర్ల ఓటర్లని ఆకట్టుకోవాలని చూస్తుంది. ముఖ్యంగా ఏపీ నుంచి వచ్చి సెటిల్ అయిన వారి ఓట్లు.

ఏపీకి కేంద్ర ప్రభుత్వం సరైన న్యాయం చేయకపోవడంతో…ఆ రాష్ట్ర ప్రజలు బీజేపీపై అసంతృప్తిగా ఉన్న విషయం తెలిసిందే…ఇక ఇదే ప్రభావం గ్రేటర్ లో ఉన్న సెటిలర్లపై కూడా ఉంది. అందుకే 2014లో టీడీపీతో పొత్తు ఉన్నప్పుడు బీజేపీ మంచి ఫలితాలే సాధించింది..కానీ 2018 ఎన్నికల్లో సత్తా చాటలేకపోయింది. అలాగే జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల్లో కూడా నార్త్ ప్రజలు సెటిల్ అయిన డివిజన్లలో బీజేపీ సత్తా చాటింది గాని..ఏపీ ప్రజలు ఉన్న డివిజన్లలో సత్తా చాటలేకపోయింది..ఏపీ సెటిలర్లు టీఆర్ఎస్ వైపు నిలబడ్డారు.

అయితే ఇప్పుడు వారిని తమవైపుకు తిప్పుకుని గ్రేటర్ లో మెజారిటీ సీట్లు దక్కించుకోవాలని బీజేపీ చూస్తుంది..బలంగా ఉన్న టీఆర్ఎస్, కాంగ్రెస్ లకు చెక్ పెట్టే దిశగా ముందుకెళుతుంది. సెటిలర్లని తమవైపుకు తిప్పుకునేందుకు నెక్స్ట్ జనసేనతో ఖచ్చితంగా పొత్తులో ముందుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. పవన్ మద్ధతుతోనే సెటిలర్లని తిప్పుకోవాలని ఛూస్తున్నారు. కాకపోతే ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ…టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉండమతో…కొందరు ఆ పార్టీ వైపే ఉన్నారు.

అందుకే పవన్ సపోర్ట్ తో కొందరినైనా తిప్పుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే టీడీపీ నుంచి బీజేపీలో చేరిన గరికిపాటి రామ్మోహన్ రావుకు..ఏపీ సెటిలర్లతో మంచి పరిచయాలు ఉన్నాయి…ఇక ఆయన ద్వారా కూడా సెటిలర్లని ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే క్రమంలో ఏపీలో టీడీపీతో గాని బీజేపీ పొత్తు పెట్టుకుంటే…గ్రేటర్ లో బీజేపీకి కాస్త కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ బీజేపీ మాత్రం..చంద్రబాబుతో పొత్తుకు సై అనడం లేదు. మొత్తానికైతే సెటిలర్లని ఆకర్షించడానికి బీజేపీ గట్టిగానే ప్లాన్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news