ఆర్‌ఎక్స్100 లాగే హిప్పీ కూడా..? కావల్సినన్ని బోల్డ్ సీన్లు..?

-

ఆర్‌ఎక్స్100 సినిమాలోలాగే హిప్పీలోనూ పలు బోల్డ్ సన్నివేశాలు ఉంటాయని మనకు సినిమా టీజర్, ట్రైలర్‌లను చూస్తే అర్థమవుతుంది.

నటుడు కార్తికేయ ఆర్‌ఎక్స్100 సినిమాతో ఎంత పేరు తెచ్చుకున్నాడో అందరికీ తెలిసిందే. ఆ సినిమాలో కథతోపాటు కార్తికేయ, పాయల్ రాజ్‌పూత్‌ల నటనకు, కెమిస్ట్రీకి బాగానే మార్కులు పడ్డాయి. ఈ క్రమంలోనే తొలి సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న కార్తికేయ రేపు హిప్పీగా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రేపు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

అయితే ఆర్‌ఎక్స్100 సినిమాలోలాగే హిప్పీలోనూ పలు బోల్డ్ సన్నివేశాలు ఉంటాయని మనకు సినిమా టీజర్, ట్రైలర్‌లను చూస్తే అర్థమవుతుంది. ఇక ఈ సినిమాకు ఇప్పటికే సెన్సార్ బోర్డు A సర్టిఫికెట్‌ను ఇచ్చింది. దీంతో హిప్పీలో కావల్సినంత అడల్ట్ కంటెంట్ ఉంటుందని భావిస్తున్నారు. ఈ సినిమాకు చెందిన టీజర్, ట్రైలర్లలోనూ మనకు అది స్పష్టంగా కనిపించింది.

కాగా హిప్పీ సినిమాలో కార్తికేయ సరసన దిగంగన సూర్యవంశీ, జజ్బా సింగ్‌లు హీరోయిన్లుగా నటించారు. జేడీ చక్రవర్తి, వెన్నెల కిశోర్‌లు ఈ సినిమాలో కీలకపాత్రలు పోషించారు. ఇక రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన హిప్పీ సినిమా రేపు విడుదల కానున్న నేపథ్యంలో ప్రేక్షకులను ఏ మేర ఆకట్టుకుంటుందో వేచి చూడాలి..!

Read more RELATED
Recommended to you

Latest news