ఇదేమి మొక్క అని ఆలోచిస్తున్నారా? ప్రకృతి ప్రసాదించిన ఎన్నో మొక్కలలో ఇది కూడా ఒకటి. ఎన్నో ఔషధ గుణాలను తనలో దాచుకొని ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని ప్రసాదించే ఈ మొక్క గురించి ప్రతి ఒక్కరు చదివి తెలుసుకోవాల్సిందే. ముఖ్యంగా ప్రకృతికి దగ్గరగా జీవించే మనిషికి రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఏ సీజన్లో దొరికే పండ్లు, కూరగాయలు ఆ సీజన్లో తీసుకుంటూ చాలా ఆరోగ్యంగా జీవిస్తున్నారు. ఇకపోతే మన ఆరోగ్యానికి మేలు చేసే మొక్కలు మన చుట్టూనే ఉన్నాయి కానీ మనం వాటిని గుర్తించలేకపోవడం మన దౌర్భాగ్యం అని చెప్పాలి. ముఖ్యంగా అడవులు, బీడు, బంజర భూముల్లో కనిపించే కొన్ని రకాల మొక్కలను మనం కలుపు మొక్కలు, పిచ్చి మొక్కలు అని పీకేస్తూ ఉంటాము కానీ వీటి వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే మాత్రం ఆశ్చర్య పోవాల్సిందే.
ఇక వీటిలో పులి అడుగు మొక్క కూడా ఒకటి. ఇది చూడడానికి పులి పంజా లాగా దీని ఆకులు ఉండడం చేత దీనిని అలా పిలుస్తూ ఉంటారు. ఇక ఇది ఒక జాతి మొక్క ఆయుర్వేదంలో ఉపయోగించే ఈ మొక్క ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో ప్రయోజనాలను ఇమిడి ఉంది . ఇకపోతే తేలు , పాము వంటి విష జంతువులు కరిచినప్పుడు ఈ ఆకులను కాటు వేసిన ప్రాంతంలో పెట్టి బట్ట చుట్టితే విషం హరిస్తుంది. ఇక కుక్క కరిచినప్పుడు ఈ ఆకుల రసాన్ని బాధితుడికి తాగించడం వల్ల కుక్క కాటు విషం తగ్గిపోతుందని నమ్మకం. ఇకపోతే పైల్స్, మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి మొలలు ఉన్నచోట ఈ ఆకులను పేస్ట్ గా నూరి అప్లై చేస్తే సమస్యలు తగ్గిపోతాయి .
ఇక అంతేకాదు కీళ్ల నొప్పులు మోకాళ్ళ నొప్పులతో బాధపడే వారికి కూడా ఈ ఆకుల పేస్టు మెత్తగా నూరి నొప్పి ఉన్న ప్రదేశంలో వేసి కట్టు కడితే నొప్పులు తగ్గిపోతాయి.