రోహిత్ వన్ మ్యాన్ షో.. భారత్ శుభారంభం..!

-

ఓపెనర్ శిఖర్ ధావన్ 8 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టగా… వెంటనే క్రీజ్ లోకి వచ్చిన కోహ్లీ కూడా ఎక్కువ సేపు నిలవలేకపోయినప్పటికీ.. తర్వాత వచ్చిన కేఎల్ రాహుల్ భాగస్వామ్యంతో రోహిత్ 85 పరుగులు చేశాడు.

టెస్ట్ మ్యాచ్ ఆడినట్టుగా… బాల్స్ మింగేసినా సరే.. సెంచరీ బాది వన్ మ్యాన్ షో చేసి మరీ భారత్ కు విజయాన్ని అందించాడు రోహిత్ శర్మ. నో డౌట్.. హిట్ మ్యాన్ రోహితే ఈ మ్యాచ్ ను గెలిపించాడు. ఆది నుంచి సౌతాఫ్రికా బౌలర్ల ధాటిని తట్టుకుంటూ… ఏమాత్రం తడబడకుండా నెమ్మదిగా ఇన్నింగ్స్ ను ఆడుతూ.. జట్టుకు స్కోరును పెంచాడు.

ఓపెనర్ శిఖర్ ధావన్ 8 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టగా… వెంటనే క్రీజ్ లోకి వచ్చిన కోహ్లీ కూడా ఎక్కువ సేపు నిలవలేకపోయినప్పటికీ.. తర్వాత వచ్చిన కేఎల్ రాహుల్ భాగస్వామ్యంతో రోహిత్ 85 పరుగులు చేశాడు.

కేఎల్ రాహుల్ కూడా ఔటవడంతో ధోనీ క్రీజ్ లోకి వచ్చాడు. కానీ.. ధోనీ కూడా ఎక్కువ సేపు క్రీజులతో నిలబడలేకపోయాడు. కానీ.. వీళ్లందరి భాగస్వామ్యంతో రోహిత్ శర్మ జట్టుకు మాత్రం భారీ పరుగులను అందించాడు. తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా బౌండరీ బాది జట్టును గెలిపించడంతో ప్రపంచకప్ లో భారత్ మంచి శుభారంభాన్ని ఇచ్చింది.

ఇక సెంచరీ చేసి జట్టును గెలిపించిన రోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌత్ ఆఫ్రికా 9 వికెట్ల నష్టానికి 50 ఓవర్లలో 227 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్ కు దిగిన భారత్.. కేవలం 4 వికెట్ల నష్టానికి 50 ఓవర్లు పూర్తి కాకముందే మ్యాచ్ ను ఫినిష్ చేసింది.

మరోవైపు ప్రపంచ్ కప్ లో దక్షిణాఫ్రికా బోణీ కూడా చేయలేదు. ఇప్పటి వరకు మూడు మ్యాచులు ఆడిన దక్షిణాఫ్రికా.. మూడు మ్యాచుల్లోనూ ఓడిపోయింది. మొదటగా ఇంగ్లండ్ తో తర్వాత పసికూన బంగ్లాదేశ్ తో ఇప్పుడు భారత్ తో జరిగిన మ్యాచ్ లోనూ ఓడిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news