సీఎంగా రాష్ట్రాన్ని అభివృద్ధి బాటపట్టించడం కేసీఆర్ బాధ్యత…అలాగే ప్రజా సమస్యలని తెలుసుకుని వాటిని పరిష్కరించాలి. నియోజకవర్గాల వారీగా సమస్యలని పరిష్కరించాలి…అభివృద్ధి చేయాలి. కానీ కేసీఆర్…సీఎం అర్ధాన్ని మార్చేస్తున్నట్లు కనిపిస్తున్నారు…కేవలం ఉపఎన్నిక వస్తేనే నియోజకవర్గం అభివృద్ధి గాని, సమస్యలు గాని గుర్తొచ్చేలా ఉన్నాయి. గుర్తు రావడం కాదు…కేసీఆర్ తీరు అలాగే ఉంది..ఇక ఎక్కడైనా ఉపఎన్నిక వస్తే ఆ నియోజకవర్గ ప్రజలు బాగా లక్కీ అనమాట.
ఉపఎన్నిక వస్తే చాలు కోట్లు కుమ్మరించి…ఆ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయడం…సమస్యలని పరిష్కరించడం చేస్తారు. అందుకే ఆయా నియోజకవర్గ ప్రజలు..తమ ఎమ్మెల్యే కూడా రాజీనామా చేస్తే బాగుండు… తమకు కూడా ఉపఎన్నిక వస్తే బాగుండు అనే పరిస్తితికి వచ్చేశారు. ఇదంతా హుజూరాబాద్ ఉపఎన్నిక తర్వాత బాగా ఎక్కువైంది. అక్కడికే హుజూర్ నగర్, దుబ్బాక, నాగార్జున సాగర్ ఉపఎన్నికల్లో కేసీఆర్ ఏ స్థాయిల్లో..ఆయా నియోజకవర్గాలకు హామీలు ఇచ్చారో..నిధులు ఇచ్చారో చెప్పాల్సిన పని లేదు.
ఆ ఉపఎన్నికలు ఒక ఎత్తు అయితే…హుజూరాబాద్ మరొక ఎత్తు అయింది…అక్కడ ఈటల రాజేందర్ ని ఓడించడానికి కేసీఆర్ ఎన్ని కోట్లు గుమ్మరించారో చెప్పాల్సిన పని లేదు..నియోజకవర్గానికి కోట్లలో అభివృద్ధి పనులు చేయించారు. పలు సమస్యలని పరిష్కరించడానికి ట్రై చేశారు. ఇక ఊహించని విధంగా ఒకో దళిత కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఇచ్చేందుకు దళితబంధు కూడా తీసుకొచ్చారు. కానీ ఎన్ని చేసిన కేసీఆర్ ని..ప్రజలు నమ్మలేదు…హుజూరాబాద్ లో టీఆర్ఎస్ ని ఓడించారు.
ఇక విచిత్రమైన విషయం ఏంటంటే…ఎన్నిక వరకే హామీల అమలు…ఎన్నిక అయిపోగానే…హామీలు గంగలో కలిసిపోతాయి. అసలు ఇప్పుడు దళితబంధు ఏమైందో క్లారిటీ లేదు. ఇలా ఉపఎన్నిక కోసమే పనిచేస్తున్నట్లు కనిపించే కేసీఆర్…మరోసారి మునుగోడు ఉపఎన్నికపై దృష్టి పెట్టారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి…కాంగ్రెస్ కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి…బీజేపీలోకి వెళ్ళడం దాదాపు ఖాయమైంది…ఈ నేపథ్యంలో మునుగోడుకు ఉపఎన్నిక గ్యారెంటీ అని కేసీఆర్ ముందే ఫిక్స్ అయిపోయారు.
అందుకే ఇప్పుడు ఆ దిశగానే పనిచేసుకుంటూ వెళుతున్నారు..ఉపఎన్నికలో గెలవడం కోసం..మునుగోడులో బలంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులని టీఆర్ఎస్లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే ఇంతవరకు పరిష్కరించని సమస్యలని ఇప్పుడు పరిష్కరించడానికి రెడీ అయ్యారు. ఈ నియోజకవర్గంలో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న, గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి ఓటమికి కారణమైన గట్టుప్పల్ మండల ఏర్పాటును అనూహ్యంగా ప్రకటించారు. అలాగే ఇక్కడ పెండింగ్‌లో ఉన్న సమస్యలపై దృష్టి పెట్టారు…డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా పూర్తి చేయాల్సిన రిజర్వాయర్లు, భూనిర్వాసితులకు నష్టపరిహారం అందజేయడం లాంటి కార్యక్రమాలు చేయడానికి సిద్ధమయ్యారు.
అలాగే గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ఇక అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రధానమైన రోడ్ల నిర్మాణాలని పెద్ద సంఖ్యలో చేపట్టాలని నిర్ణయించారు. మునుగోడులో గెలవడానికి ఇంకా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి కేసీఆర్ రెడీ అయ్యారు. అంటే ఉపఎన్నిక ఉంటేనే కేసీఆర్ కు అభివృద్ధి చేయాలని ఉంటుంది అనుకుంటా అని ప్రజలు మాట్లాడుకునే పరిస్తితి. అందుకే ఎవరికి వారు తమకు కూడా ఉపఎన్నిక వస్తే బాగుండు అనే స్థితికి కేసీఆర్ తీసుకొచ్చారు.