నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కు విపక్షాలు లేఖ రాశాయి. దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తుందంటూ విపక్షాలు లేఖ లో పేర్కొన్నాయి. రాజకీయ ప్రత్యర్థులపై ఈడి, సిబిఐ లను కేంద్రం ఉసిగొల్పుతోందని విపక్షాలు ఆరోపణలు చేశాయి. నిత్యవసర ధరల పెరుగుదలపై పార్లమెంటులో ప్రత్యేకంగా చర్చ జరపాలని, నిత్యవసర సరుకులపై జిఎస్టి విధించడం పై పార్లమెంటులో చర్చకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని విపక్ష పార్టీల నేతలు అన్నారు.
కేంద్రం ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. కాగా సోమవారం భారత 15వ రాష్ట్రపతిగా పార్లమెంటు సెంట్రల్ హాలులో నూతన రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే.