తెలంగాణ కంటే అప్పులు తక్కువే చేశాం – బుగ్గన రాజేంద్రనాథ్

-

తెలంగాణ కంటే అప్పులు తక్కువే చేశామని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో అప్పులు అంటూ ప్రచారం కావాలని చేస్తున్నారు… ప్రజలకు భయం సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. వివిధ రాష్ట్రాలకు చెందిన అప్పుల వివరాలు మాత్రమే కేంద్రం ఇచ్చిందని.. 2014 నుంచి 2019 వరకు అప్పులు ఎక్కువ చేశారని తెలిపారు. టిడిపి హయాం లో కంటే తక్కువ చేశామని.. స్థూల ఉత్పత్తితో పోలిస్తే, అప్పు ఎలా ఎక్కువ అవుతుందని చెప్పారు.


ఏపీనే తక్కువ అప్పు చేసిందని.. కోవిడ్ సంక్షోభం ఉందన్నారు. ద్రవ్యలోటు గురించి మాట్లాడుతున్నారని.. జగన్ సర్కార్ వచ్చాక 3 శాతం ద్రవ్యలోటు తగ్గిందని స్పస్టం చేశారు. ఆంధ్రరాష్టం అప్పులు అని అన్యాయంగా ప్రచారం చేస్తున్నారు.. స్థూల ఉత్పత్తి మీద అప్పుల నిష్పత్తి చూస్తే కర్నాటక , ఎపిలు దాదాపు సమానంగా ఉన్నాయని వెల్లడించారు. ఫైనాన్స్ నిబంధనలపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు.. టిడిపి హయాంలో 8 శాతం ఇంట్రస్ట్ అప్పు తెచ్చారని స్పష్టం చేశారు బుగ్గన.
వైసిపి వచ్చాక 7 శాతానికి ఇంట్రస్ట్ తగ్గించామని తెలిపారు బుగ్గన రాజేంద్రనాథ్.

Read more RELATED
Recommended to you

Latest news