మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ఆగస్టు 2న ప్రారంభమై 24రోజుల పాటు సాగుతుందన్నారు బిజెపి ప్రజాసంఘామయాత్ర ప్రముఖ్ గంగిడి మనోహర్ రెడ్డి.డీజీపీని కలిసి పాదయాత్రకు పూర్తి భద్రతను కల్పించాలని కోరామన్నారు.తెలంగాణ సాయుధ పోరాటం జరిగిన గడ్డపై మూడో విడత పాదయాత్ర జరుగుతుందన్నారు.చేనేత దినోత్సవమైన ఆగస్టు 7న భూదాన్ పోచంపల్లిలో పాదయాత్ర నడుస్తుందని తెలిపారు.
గుండ్రామ్ పల్లి,ఖిలాషాపూర్ మీదగా పాదయాత్ర సాగుతుందని,ప్రజా సంగ్రామ యాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయన్నారు.పాదయాత్ర మధ్యలో కేంద్ర మంత్రులు, బిజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు హాజరవుతారని తెలిపారు. అలాగే బిజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ మాట్లాడుతూ..12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మూడో విడత ప్రజాసంఘామ పాదయాత్ర జరుగుతుందన్నారు.ఆగస్టు 26న భద్రకాళి ఆలయం దర్శనం తరువాత బహిరంగ సభతో ముగుస్తుందన్నారు.
రెండు విడతల పాదయాత్రను విజయవంతం చేసిన పార్టీ శ్రేణులు మూడో విడతను విజయవంతం చేయాలనీ కోరారు.రెండు విడతల పాదయాత్ర కంటే మూడో విడతను పెద్ద ఎత్తున నిర్వహిస్తామన్నారు.ఉమ్మడి నల్లగొండ, వరంగల్ జిల్లాల ప్రజలను పాదయాత్రలో భాగస్వామ్యం చేస్తామన్నారు.రేపు పాదయాత్ర నిర్వహణ కమిటీలతో బండి సంజయ్ సమావేశం అవుతారని తెలిపారు.పాదయాత్ర విజయవంతం చేయాలని అరె మైసమ్మ దేవాలయంలో పూజలు నిర్వహించామన్నారు దుగ్యాల ప్రదీప్.