పవన్ ఎఫెక్ట్: తమ్ముళ్లలో టెన్షన్?

-

నెక్స్ట్ ఎన్నికల్లో టీడీపీ-జనసేనల మధ్య పొత్తు ఉంటుందో ఉండదో అసలు క్లారిటీ రావడం లేదు…ఒకసారి రెండు పార్టీల మధ్య పొత్తు ఉన్నట్లే రాజకీయం నడుస్తోంది…మరొకసారి మాత్రం ఎవరికి వారే సింగిల్ గానే పోటీ చేస్తామన్నట్లు మాట్లాడుకుంటారు. దీని వల్ల పొత్తు విషయం క్లారిటీ లేదు..అయితే ఎన్నికల ముందే పొత్తు గురించే చర్చించుకోవాలని చంద్రబాబు-పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అప్పుడు పరిస్తితులని బట్టి పొత్తు పెట్టుకోవడానికే మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి.

ఎందుకంటే అధికార బలంతో ఉన్న వైసీపీని ఢీకొట్టాలంటే టీడీపీ-జనసేన పొత్తు తప్పనిసరి అని తెలుస్తోంది. పైగా రెండు పార్టీలు విడిగా పోటీ చేస్తే వైసీపీకి మేలు జరుగుతుంది. ఎక్కువ శాతం రెండు పార్టీల మధ్య పొత్తు ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి…కానీ ఈ పొత్తు అంశం ఎన్నికల ముందు తేలేలా ఉంది. అయితే పొత్తు విషయంలో తెలుగు తమ్ముళ్ళు బాగా టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గోదావరి జిల్లాల తమ్ముళ్ళు…ఎందుకంటే ఈ జిల్లాల్లోనే జనసేనకు బలం ఎక్కువ ఉంది…పొత్తు ఉంటే…ఈ జిల్లాల్లోనే సీట్లు ఎక్కువ తీసుకుంటుంది.

పొత్తు ఉంటే ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జనసేనకు ఎక్కువ సీట్లు కేటాయించవచ్చు..దీని వల్ల మొదటనుంచి పనిచేస్తున్న టీడీపీ ఇంచార్జ్ లు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. పోనీ పొత్తు గురించి ముందే తెలిస్తే కాస్త లైట్ తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా ఎన్నికల వరకు పనిచేసి…చివరికి జనసేనకు సీటు ఇవ్వాలంటే చాలా ఇబ్బంది అవుతుంది.

ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు దూకుడుగా పనిచేస్తున్నారు…ఆర్ధికంగా కూడా కాస్త బాగానే ఖర్చు పెట్టి పార్టీ కార్యక్రమాలు నడిపిస్తున్నారు. ఈ తరుణంలో సీటు రాకపోతే తమకు ఇబ్బందే అని కొందరు తమ్ముళ్ళు టెన్షన్ పడుతున్నారు. అయితే పొత్తు విషయంలో అంతర్గతంగా కొందరు తమ్ముళ్ళకు బాబు హింట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. జనసేనకు కేటాయించే సీట్లలో డమ్మీ ఇంచార్జ్ లని పెట్టినట్లు తెలుస్తోంది. మొత్తానికైతే పవన్ వల్ల తమ్ముళ్ళు టెన్షన్ పడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news