అఫ్ఘనిస్తాన్ లోని కాబూల్ లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ష్పగీజా క్రికెట్ లీగ్ టీ20 సందర్భంగా కాబూల్ స్టేడియంలో బాంబు దాడి చోటు చేసుకుంది. అయితే.. ఈ సంఘటన లో ప్లేయర్లందరూ సురక్షితంగా బయట పడ్డారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. క్రికెటర్లను భద్రతా సిబ్బంది బంకర్ లోకి తరలించారు.
అ బాంబ్ దాడి సుసైడ్ బాంబ్ బ్లాస్ట్ గా అనుమానిస్తున్నారు. బ్యాండ్ ఎ అమీర్ డ్రాగన్స్ పామిర్ జల్మీ మ్యాచ్ సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. పేలుడు జరిగినప్పుడు ఐక్య రాజ్య సమితి ప్రతి నిధులు స్టేడియంలో ఉండటం గమనార్హం.
తాలిబన్ల ఆధీనంలోకి గతేడాది ఆప్గాన్ చిక్కడంతో ఎంతో మంది ప్రాణాలు గుప్పిట పట్టుకుని వలస వెళ్లిన సంగతి విధితమే. ఈ నేపథ్యంలోనే ష్పగీజా క్రికెట్ లీగ్ టీ20 సందర్భంగా కాబూల్ స్టేడియంలో బాంబు దాడి చోటు చేసుకోవడం అందరినీ వణికిస్తోంది. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.