టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ..ప్రజెంట్ పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తోంది. ‘బాహుబలి’లో రాజమాత శివగామి దేవిగా ప్రేక్షకుల మెప్పు పొందిన రమ్యకృష్ణ మరి కొన్ని సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తోంది. తన భర్త కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రంగమార్తాండ’లోనూ కీలక పాత్ర పోషించింది. అయితే, రమ్యకృష్ణ ఓ సినిమా విజయోత్సవ వేడుకలో స్టేజీపైనే కన్నీటి పర్యంతమైంది. అందుకు గల కారణమేంటో తెలుసుకుందాం.
రమ్యకృష్ణ..వెండితెరపైన సూపర్ స్టార్ గా చక్కటి అభినయం కనబరుస్తూ కొనసాగుతున్న రోజులవి. అయితే, ఆమె నటించిన సినిమాలు అప్పుడు వరుసగా అనుకున్న స్థాయిలో ఆడటం లేదు. దాంతో ఆమెకు ఇచ్చిన అడ్వాన్సులనూ నిర్మాతలను తిరిగి తీసుకుంటున్నారట. ఆ సమయంలో రమ్యకృష్ణకు కె.రాఘవేంద్రరావు సినిమా ఆఫర్ వచ్చింది. ఆ సినిమానే ‘అల్లుడు గారు’.
మోహన్ బాబు హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు. ఒకరు శోభన కాగా, మరొకరు రమ్యకృష్ణ. ఇందులో మూగ అమ్మాయిగా రమ్యకృష్ణ కనిపించింది. అయినప్పటికీ రమ్యకృష్ణను దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు చాలా చక్కగా చూపించారు. ‘ముద్ద బంతి నవ్వులు’ అనే పాటలో రమ్యకృష్ణ అభినయం చూసి జనాలు ఫిదా అయ్యారు.
ఈ సినిమా విడుదల తర్వాత రమ్యకృష్ణకు వరుసగా మళ్లీ అవకాశాలు వచ్చాయి. దాంతో రమ్యకృష్ణ చాలా హ్యాపీగా ఫీలయింది. కాగా, ఈ మూవీ సక్సెస్ మీట్ లో మాత్రం స్టేజీపైనే రమ్యకృష్ణ చాలా ఎమోషనల్ అయింది. ఎంత మంది ఓదార్చినా..అలానే స్టేజీపైన కొద్ది సేపు కన్నీటి పర్యంతమైంది. అలా తన సినీ కెరీర్ లో రమ్యకృష్ణ..‘అల్లుడు గారు’ పిక్చర్ ద్వారా సక్సెస్ వచ్చిన నేపథ్యంలో భావోద్వేగానికి గురైంది.
కె.వి.మహదేవన్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకు హైలైట్ గా నిలిచింది. శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై మోహన్ బాబు హీరోగా నటిస్తూ ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీకి దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాలో పాటల మేకింగ్ పట్ల రాఘవేంద్రరావు చాలా శ్రద్ధ వహించారు. ప్రతీ సాంగ్ చాలా చక్కగా వచ్చేలా చూశారు.అలా ఈ సినిమా విడుదలై ఘన విజయం సాధించింది.