ఆగస్టు 1 రాశి ఫలాలు..ఏ రాశివారికి ఎలా ఉందంటే?

-

మేషరాశి: మనోధైర్యంతో చేసే పనులు విజయాన్నిస్తాయి. కలహాసూచన ఉంది. ఆవేశపూరిత నిర్ణయాలు వద్దు. దుర్గా అష్టోత్తర శతనామావళి పఠిస్తే మంచిది.ఆత్మ విశ్వాసం తో ముందుకు సాగితే అంతా మంచే జరుగుతుంది.

వృషభ రాశి: వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీకు ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. మీ పనితీరుకు ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. మనశ్శాంతి లభిస్తుంది. దుర్గ శ్లోకం చదవండి. దైవదర్శనాలు.

మిథున రాశి:మీరు ఊహించిన దానికంటే అధిక ధనలాభాన్ని పొందుతారు. అభివృద్ధికి సంబంధించిన పనులలలో ముందడుగు పడుతుంది. శత్రువుల మీద మీరే విజయం సాధిస్తారు. శివారాధన మేలు చేస్తుంది.చేపట్టిన పనులు వెంటనే పూర్తీ అవుతాయి.

కర్కాటక రాశి : సన్నిహితులతో మాటపట్టింపులు. పనులు వాయిదా పడతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. రుణదాతల ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

సింహ రాశి : దూరప్రాంతాల నుండి శుభవార్తలు. వాహనయోగం. ప్రముఖులతో చర్చలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత సానుకూలత.

కన్య రాశి: ఇంటాబయటా సమస్యలు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం. సోదరులతో విభేదాలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.

తులరాశి : వ్యవహారాలలో విజయం. ధన, వస్తులాభాలు. పరిచయాలు విస్తృతమవుతాయి. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

వృశ్చిక రాశి: కీలక సమస్యలను పరిష్కరిస్తారు. మీమీ రంగాల్లో అధికారుల ప్రశంసలు అందుకుంటారు. కుటుంబసభ్యుల సహకారం ఉంటుంది. శివ నామస్మరణ చేస్తే మేలు.

ధనుస్సు రాశి: వాదప్రతివాదాల జోలికి పోకుండా ఉండటం మేలు. గోసేవ చేయడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. అపమృత్యు భయం వల్ల మనశ్శాంతి తగ్గుతుంది. శని శ్లోకం చదవాలి.ఈరోజు కొంతవరకు అనుకున్న పనులు పూర్తి అవుతాయి.

మకర రాశి: ప్రయాణాలలో స్వల్ప మార్పులు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఖర్చులు అధికమవుతాయి. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా ఉంటాయి.

కుంభ రాశి: సోదరుల నుండి పిలుపు. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. భూములు, వాహనాలు కొంటారు. ఆర్థికాభివృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు వీడతాయి..

మీన రాశి: అనుకున్న పని నెరవేరుతుంది. ముఖ్య విషయాల్లో పురోగతి సాధిస్తారు. అందరినీ కలుపుకొని పోవడం వల్ల లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారు. ఇష్టదైవ ధ్యానం మేలు చేస్తుంది..మంచి రోజు..

Read more RELATED
Recommended to you

Latest news