ప్రముఖ ప్రొడ్యూసర్​ ఇంటిపై ఐటీ దాడులు

-

తమిళనాడులో ప్రముఖ ఫైనాన్షియర్, చిత్ర నిర్మాత అన్బు చెళియన్​ ఇళ్లు, కార్యాలయాలపై ఆదాయ పన్ను శాఖ దాడులు చేసింది. చెన్నై, మధురై సహా ఆ రాష్ట్రంలోని మొత్తం 10 చోట్ల అన్బు​కు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాల్లో మంగళవారం ఉదయం ఐటీ అధికారులు సోదాలు చేశారు.

అన్బు చెళియన్​.. తమిళ సినీ పరిశ్రమలో ప్రముఖ ఫైనాన్షియర్. విజయ్​ నటించిన బిగిల్​ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన ఏజీఎస్​ ఎంటర్​టైన్​మెంట్​కు ఆయన ఆర్థిక వనరులు సమకూర్చారు. గోపురం ఫిలింస్ అనే బ్యానర్​పై కొన్ని సినిమాలు నిర్మించారు.

2020 ఫిబ్రవరిలోనూ ఇదే తరహాలో అన్బు చెళియన్​ ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ అధికారులు దాడులు చేశారు. చెన్నై, మధురైలోని నివాసాల నుంచి రూ.50కోట్లు స్వాధీనం చేసుకున్నారు. అన్బు చెళియన్​ స్నేహితుడు శరవణన్​ ఇంట్లోనూ తనిఖీలు చేపట్టారు. మధురైలోని నివాసం నుంచి రూ.15కోట్లు జప్తు చేశారు. అదే సమయంలో హీరో విజయ్ ఇళ్లలోనూ సోదాలు జరిపి, ఆయన్ను ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news