సెక్స్ విషయంపై కరణ్ పై ఫైర్ అయిన కరీనాకపూర్.. మీ అమ్మకు ఓకేనా అంటూ..?

-

బాలీవుడ్ లో బాగా పాపులారిటీ సంపాదించుకున్న టాక్ షో కాఫీ విత్ కరణ్ షో గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఇప్పటికే ఆరు సీజన్ లను పూర్తి చేసుకున్న ఈ షో..ప్రస్తుతం ఏడవ సీజన్ ను విజయవంతంగా పూర్తి చేసుకునే ప్రయత్నంలో ఉంది. ప్రముఖ బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. కరణ్ జోహార్ చేసే ఇంటర్వ్యూలలో అసలు సంగతులు కన్నా కొసర సంగతులు బాగా హైలైట్ అవుతున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ షోలో పాల్గొనే సెలబ్రెటీలు పక్కాగా తమ సినిమా ప్రమోషనల్ ఈవెంట్ కోసమే ఇక్కడ అటెండ్ అవుతూ ఉంటారు.ముఖ్యంగా ఏ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంటే ఆ సినిమాకు సంబంధించిన స్టార్లు ఈ షోలో కనిపిస్తూ ఉంటారని చెప్పవచ్చు. ఇక వాళ్ళు ఎలాగో తమ అవసరం కోసమే వస్తారు కాబట్టీ..వచ్చిన వాళ్లను కరణ్ కూడా సెక్స్ గురించి.. ఎఫైర్ల గురించి ..ఫేవరెట్ సెక్స్ పొజిషన్ ల గురించి అడుగుతూ ఉంటాడు. ఇక ఇదంతా ప్రతి ఒక్కరికి రొటీన్ గానే అనిపిస్తుంది. ఇక ఈ క్రమంలోనే కరీనాకపూర్ , అమీర్ ఖాన్ లు కూడా పాల్గొన్న ఎపిసోడ్ లో కూడా ఇదే తథంగం కొనసాగించాడు. కరణ్ జోహార్ ముఖ్యంగా సెక్స్ మ్యాటర్ ను హైలెట్ చేయడం జరిగింది.. ఇకపోతే కరీనాను ఉద్దేశించి మాట్లాడుతూ.. పెళ్ళై.. పిల్లలు ఉన్నారు కదా? పిల్లలు పుట్టిన తర్వాత క్వాలిటీ సెక్స్ ఉంటుందా? అంటూ తన సెక్సీ సందేహాన్ని వ్యక్తం చేశాడు.

నీకు తెలియదా అంటూ? కరణ్ ను ఎదురు ప్రశ్నించిన కరీనా.. ఆ తర్వాత తన షో ను తన తల్లి చూస్తుందని.. కాబట్టి తన సెక్స్ లైఫ్ గురించి మాట్లాడలేనంటూ కరణ్ తప్పించుకోబోతుంటే.. అంటే వేరే వాళ్ళ సెక్స్ లైఫ్ గురించి మాట్లాడడానికి మీ తల్లి ఒప్పుకుంటుందా? హర్షిస్తుందా? అంటూ కరణ్ కు సూటిగా చురకలంటించింది కరీనాకపూర్. ఇక కరీనా దెబ్బకు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మార్చాడు కరణ్ జోహార్. అంతేకాదు ఇలాంటి ఎదురు దెబ్బలు పడినప్పుడు కూడా తనకేమి తగలనట్టుగా నవ్వుతూ వ్యవహరిస్తాడు. ఇకపోతే ఇప్పటికైనా కరణ్ ఇలాంటి మాటలు మాట్లాడకపోవడమే మంచిది అంటూ పలువురు నెటిజన్లు కౌంటర్ ఇస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news