గత కొన్ని రోజులుగా ఏపీలో కోనసీమ జిల్లా పేరును డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌గా మార్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ
నేపథ్యంలోనే.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాపై తుది నోటిఫికేషన్ విడుదలైంది. దీని ప్రకారం కోనసీమ జిల్లాను ఇకపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా వ్యవహరిస్తారు. ఈ మేరకు ప్రభుత్వం నిన్న రాత్రి పొద్దుపోయాక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా ప్రభుత్వం తొలుత కోనసీమ జిల్లాను ఏర్పాటు చేసింది.
అయితే, ఆ తర్వాత ఈ జిల్లా పేరును డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మారుస్తూ మే 18న ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసింది. తొలుత ప్రకటించిన జిల్లా పేరుకు ముందు అంబేద్కర్ పేరును చేర్చడాన్ని నిరసిస్తూ జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. తాజాగా, ఇప్పుడు అదే పేరును ఖరారు చేస్తూ ప్రభుత్వం తుది నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీంతో ఇకపై ఈ జిల్లాలను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా వ్యవహరించనున్నారు అధికారులు.