అత్యాధునిక టెక్నాలజీతో అన్ని హంగులతో తెలంగాణాకే తలమానికంగా సిటీ పోలీస్ కమిషనరేట్ నిర్మాణం జరిగిన విషయం తెలిసిందే. తెలంగాణ రాజధాని హైదరాబాద్లో మరో ల్యాండ్ మార్క్ భవనం ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. నగరంలో తెలంగాణ రాష్ట్ర పోలీసు కమాండ్ కంట్రోల్ భవన నిర్మాణం పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో.. ఈ భవనాన్ని గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ భవనం ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన మంత్రి కేటీఆర్… ఆ భవనం ప్రాధాన్యాన్ని వివరిస్తూ బుధవారం సాయంత్రం ఓ ట్వీట్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర పోలీస్ సమీకృత కమాంట్ అండ్ కంట్రోల్ సెంటర్ (టీఎస్పీఐసీసీసీ) పేరిట నిర్మించిన ఈ భవనం ప్రపంచ శ్రేణి ప్రమాణాలతో నిర్మించినట్లు తెలిపారు కేటీఆర్. దేశంలోనే అత్యంత సౌకర్యవంతమైన ప్రభుత్వ భవనంగా దీనికి గుర్తింపు లభించనుంది అని ఆయన పేర్కొన్నారు. గురువారం ఈ భవనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నట్లు తెలిపారు కేటీఆర్.
A truly world class Telangana State Police Integrated Command & Control Centre (TSPICCC) all set to be inaugurated by Hon’ble CM #KCR Garu tomorrow in Hyderabad
Possibly one of the most sophisticated Govt facility built by any Govt in India pic.twitter.com/pO5RkCjClV
— KTR (@KTRTRS) August 3, 2022