దివంగత స్టార్ హీరోయిన్ అతి లోక సుందరి శ్రీదేవికి తెలుగు నాట ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగులో శ్రీదేవి నటించిన సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ కావడం విశేషం. సీనియర్ ఎన్టీఆర్ నుంచి చిరంజీవి వరకు స్టార్ హీరోలందరి సరసన హీరోయిన్ గా యాక్ట్ చేసిన శ్రీదేవి.. నట వారసురాలిగా ఆమె తనయ జాన్వీకపూర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి దూసుకుపోతున్నది.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా జాన్వీకపూర్ ప్రజెంట్ క్రేజీ ఫిల్మ్స్ లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది. త్వరలో తెలుగులోనూ జాన్వీకపూర్ నటించబోతున్నదని వార్తలొస్తున్నాయి. ఈ సంగతులు పక్కనబెడితే..శ్రీదేవి కంటే ముందర ఆమె ఫ్యామిలీలో నటులున్నారు. ఎవరంటే…శ్రీదేవి తల్లియే… శ్రీదేవి తల్లి రాజేశ్వరి పలు సినిమాల్లో నటించింది. అయితే, ఈ విషయం చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది.
స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషించింది శ్రీదేవి తల్లి రాజేశ్వరి. మహానటి సావిత్రి కథానాయికగా వచ్చిన ‘చివరకు మిగిలేది’ చిత్రంలో రాజేశ్వరి నటించింది. అక్కనేని నాగేశ్వరరావు (ఏఎన్ఆర్) ‘శాంతి నివాసం’ ఫిల్మ్ లోనూ రాజేశ్వరి నటించింది. అలా పలు చిత్రాల్లో సపోర్టింగ్ రోల్ ప్లే చేసింది రాజేశ్వరి. ఇక రాజేశ్వరి తనయ శ్రీదేవి చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత హీరోయిన్ గా నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది.
అలా రాజేశ్వరి నటవారసత్వాన్ని శ్రీదేవి కొనసాగించడమే కాదు..నిలబెట్టిందని చెప్పొచ్చు. తల్లిని మించిన తనయగా శ్రీదేవి ఇండస్ట్రీలో రాణించింది. స్టార్ హీరోయిన్ గా దశాబ్దాల పాటు కొనసాగిన శ్రీదేవి.. సెకండ్ ఇన్నింగ్స్ లోనూ అదరగొట్టింది. ‘ఇంగ్లిష్ వింగ్లిష్’, ‘మామ్’ వంటి ఉమన్ సెంట్రిక్ ఫిల్మ్స్ చేసి తన సత్తా ఏంటో చూపించింది శ్రీదేవి.