కాపు ఎమ్మెల్యేలకు కల్యాణ్ టెన్షన్!

-

సొంతవర్గానికి చెందిన పవన్ కల్యాణ్ పేరు చెబితే చాలు…చాలామంది కాపు ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతున్నారట. గత ఎన్నికల్లో ఆయన ఒంటరిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి…తమ గెలుపు సాధ్యమైందని, ఈ సారి గాని పవన్..టీడీపీతో కలిస్తే తమ గెలుపు కష్టమే అని  వైసీపీ కాపు ఎమ్మెల్యేల్లో బాగా టెన్షన్ పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో వాస్తవం లేకపోలేదు. గత ఎన్నికల్లో జనసేన విడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి..వైసీపీ గెలిచేసింది.

అంటే టీడీపీపై వైసీపీకి వచ్చిన మెజారిటీ కంటే జనసేనకు ఎక్కువ ఓట్లు పడిన నియోజకవర్గాలు చాలానే ఉన్నాయి…వాటిల్లో కాపు ఎమ్మెల్యేలు గెలిచిన స్థానాలు కూడా ఉన్నాయి. అందుకే ఈ సారి కూడా పవన్ ఒంటరిగా పోటీ చేస్తే బాగుండు అని వైసీపీ కాపు ఎమ్మెల్యేలు అనుకునే పరిస్తితి. అలా కాకుండా పవన్..టీడీపీతో కలిస్తే మెజారిటీ కాపు ఎమ్మెల్యేలు అస్సామే. గత ఎన్నికల్లో మొత్తం 30 మంది కాపు ఎమ్మెల్యేలు గెలిచారు. అందులో టీడీపీ నుంచి గెలిచిన నిమ్మల రామానాయుడు, గంటా శ్రీనివాసరావు, నిమ్మకాయల చినరాజప్పని పక్కన పెడితే…వైసీపీకి చెందిన 27 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

వీరిలో పవన్ వల్ల ఎక్కువ టెన్షన్ పడేది..అంబటి రాంబాబు, దూలం నాగేశ్వరావు, పేర్ని నాని, సింహాద్రి రమేష్, ఆళ్ళ నాని, కొట్టు సత్యనారాయణ, గ్రంథి శ్రీనివాస్, పుప్పాల వాసు, శ్రీనివాస్ నాయుడు, కన్నబాబు, దొరబాబు, జక్కంపూడి రాజా, పర్వత ప్రసాద్, అవంతి శ్రీనివాస్, గుడివాడ అమర్నాథ్…ఈ ఎమ్మెల్యేలకు పవన్ వల్ల టెన్షన్ ఎక్కువ.

ఎందుకంటే గత ఎన్నికల్లో ఈ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాల్లో జనసేనకు ఓట్లు ఎక్కువ పడ్డాయి…జనసేన ఓట్లు చీల్చడం వల్ల ఆయా స్థానాల్లో టీడీపీ నష్టపోయింది. ఈ సారి గాని టీడీపీతో పవన్ కట్టు కడితే…వైసీపీ కాపు ఎమ్మెల్యేలకు కష్టాలు తప్పవు. మొత్తానికి సొంతవర్గానికి చెందిన పవన్ తో..కాపు ఎమ్మెల్యేలకు రిస్క్ ఎక్కువే.

Read more RELATED
Recommended to you

Latest news