తల్లిపాలు అమృతంతో సమానం : మంత్రి హరీష్‌రావు

-

పేట్ల బురుజు ప్రభుత్వ దవాఖానలో శుక్రవారం తల్లి పాల బ్యాంక్‌ను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తల్లి పాలే ముద్దు, డబ్బా పాలు వద్దు. తొలి గంటలో శిశువుకు అందే తల్లి పాలు టీకాతో సమానమన్నారు. తల్లిపాలు అంత శ్రేష్టమైనది ఏదీలేదు. అవి అమృతంతో సమానం. వీటిని మరి దేంతో పోల్చలేం అని అన్నారు మంత్రి హరీశ్‌ రావు. ఎన్.ఎస్.యూలో రోజుల తరబడి ఉండే పిల్లలకు తల్లి పాలు అందాలన్న ఉద్దేశంతో పేట్ల బురుజులో మిల్క్‌ బ్యాంక్‌ను ప్రారంభించామన్నారు మంత్రి హరీశ్‌ రావు. ఆగష్టు 1 నుంచి 7వ తేదీ వరకు ప్రపంచ వ్యాప్తంగా డబ్ల్యూహెచ్ వో తల్లి పాల వారోత్సవాన్ని జరుపుతుందన్నారు. తల్లుల్లో అవగాహన పెంచాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు మంత్రి హరీశ్‌ రావు. కేవలం 36 శాతం మంది మత్రమే మొదటి గంటలో తల్లి పాలు ఇస్తున్నారు.

Modi lowered his image by restricting himself to criticising TRS: Harish Rao

64 శాతం మంది పిల్లలు మొదటి గంటలో తల్లి పాలకు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లుల్లో అవగాహన లేకపోవడం వల్ల డబ్బా పాలు ఇస్తున్నారు. సీ సెక్షన్ ఆపరేషన్ల వళ్ల ఇది జరుగుతుందన్నారు మంత్రి హరీశ్‌ రావు. నార్మల్ డెలివరీ పట్ల అవగాహన పెంచుకోవాలి. కొద్ది ముంది ముహూర్తం చూసుకొని ఆపరేషన్లు చేయమంటున్నారు మంత్రి హరీశ్‌ రావు. మరి కొద్ది మంది మా బిడ్డ పురిటి నొప్పులు పడలేదు ఆపరేషన్ చేయమని ఒత్తిడి చేస్తున్నారు. ఇవేవి సరైన పద్ధతులు కావన్నారు మంత్రి హరీశ్‌ రావు. వైద్యుల సూచన మేరకే ముందుకెళ్లాలన్నారు మంత్రి హరీశ్‌ రావు. రాష్ట్ర వ్యాప్తంగా ఎ.ఎన్.ఎంలు, ఆశా వర్కర్లు, సర్పంచ్‌లు గ్రామాల్లో తల్లి పాల వారోత్సవాల ప్రాముఖ్యతను వివరిస్తున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య పెరిగిందన్నారు మంత్రి హరీశ్‌ రావు. రాష్ట్రంలో ప్రభుత్వ దవాఖానల్లో 45 శాతం సి సెక్షన్ జరుగుతోందని మంత్రి హరీశ్‌ రావు తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news