తెలంగాణలో కొత్తగా 984 కరోనా కేసులు

-

ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా రక్కసి మరోసారి విజృంభిస్తోంది. దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుండటంతో దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. దీంతో మరోవైపు మంకీపాక్స్‌. సీజనల్‌ వ్యాధులు సైతం ప్రజలపై విరుచుకుపడుతున్నాయి. అయితే తాజాగా.. తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 40,663 కరోనా పరీక్షలు నిర్వహించగా, 984 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాదులో అత్యధికంగా 365 కొత్త కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 61, రంగారెడ్డి జిల్లాలో 57, నల్గొండ జిల్లాలో 41 కేసులు గుర్తించారు.

Corona vaccination without an injection › Friedrich-Alexander-Universität  Erlangen-Nürnberg

ఇంకా 687 మంది ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. అదే సమయంలో 923 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటివరకు 8,24,708 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా… 8,14,179 మంది కరోన నుంచి కోలుకున్నారు. ఇంకా 6,418 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మరణించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news